కాళ్ళు మొక్కి చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్న పవన్ కళ్యాణ్.. జనసేనకి మెగాస్టార్ 5 కోట్ల విరాళం

Published : Apr 08, 2024, 05:40 PM IST

చూస్తుంటే జనసేన పార్టీకి మెగా ఫ్యామిలీ మద్దతు బలపడుతున్నట్లు అనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలతో పూర్తిగా బిజీ అయిపోయారు. ఏపీలో ఎన్నికలకు నెలరోజుల సమయం మాత్రమే ఉంది.

PREV
16
కాళ్ళు మొక్కి చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్న పవన్ కళ్యాణ్.. జనసేనకి మెగాస్టార్ 5 కోట్ల విరాళం

చూస్తుంటే జనసేన పార్టీకి మెగా ఫ్యామిలీ మద్దతు బలపడుతున్నట్లు అనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలతో పూర్తిగా బిజీ అయిపోయారు. ఏపీలో ఎన్నికలకు నెలరోజుల సమయం మాత్రమే ఉంది. దీనితో పవన్ కళ్యాణ్ వారాహి ఎక్కి ప్రచారం మొదలు పెట్టారు. 

26

అయితే కొద్ది సేపటి క్రితమే ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. విశ్వంభర సెట్స్ లో షూటింగ్ లో ఉన్న తన సోదరుడు చిరంజీవిని పవన్ కళ్యాణ్ కలిశారు. నాగబాబు, ఇతర జనసేన పార్టీ నేతలతో కలసి పవన్ చిరంజీవి దగ్గరకు వెళ్లారు. ఈ సందర్భంగా చిరంజీవి పవన్ కళ్యాణ్ ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. 

36

జనసేన పార్టీకి తన అండదండలు, ఆశీర్వాదం ఉంటాయని భరోసా ఇచ్చారట. అన్నయ్య ప్రేమకు భావోద్వేగానికి గురైన జనసేనాని పవన్ కళ్యాణ్.. వెంటనే చిరంజీవి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆదివారం రోజు పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో ప్రసంగించారు. ఆ ప్రసంగాన్ని చిరంజీవి టివిలో చూశారట. 

46

అనకాపల్లి నూకాలమ్మ తల్లి దీవెనలు అందుకుంటానని పవన్ అన్న మాటలు చిరంజీవి చూసారు. దీనితో తన తమ్ముడికి తన ఆశీర్వాదం కూడా ఉండాలని.. అదే విధంగా ఆర్థికంగా కూడా అండగా ఉండాలని చిరు నిర్ణయించుకున్నారట. వెంటనే రూ 5 కోట్ల రూపాయల చెక్కుని జనసేన పార్టీకి విరాళంగా అందించారు. 

56

తమ కుటుంబ ఇలవేలుపు ఆంజనేయ స్వామి పాదాల చెంత చిరంజీవి పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించి జనసేన పార్టీకి ఆర్థిక సాయం చేశారు. చిరంజీవి తో పాటు ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రాంచరణ్ కూడా జనసేన పార్టీకి ఆర్థికంగా అండగా ఉండబోతున్నట్లు తెలిపారు. 

 

66

పవన్ కళ్యాణ్ చిరంజీవిని కలసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ భేటీలో చిరు, పవన్, నాగబాబు ముగ్గురు సోదరులు ప్రస్తుతం రాజకీయాలపై ఏకాంతంగా కాసేపు మాట్లాడుకున్నారు. చిరంజీవి అండదండలు జనసేన పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తాయి అని చెప్పడం లో ఏమాత్రం సందేహం లేదు. 

Read more Photos on
click me!

Recommended Stories