రామ్ చరణ్ - ఉపాసన బ్యూటీఫుల్ ఫొటో.. అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపిన మెగాపవర్ స్టార్!

First Published Dec 27, 2022, 2:51 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన కొణిదెల బ్యూటీఫుల్ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. త్వరలో తల్లిదండ్రులు కాబోతుండటంతో... ఇటు అభిమానులూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) - ఉపాసన కొణిదెలకు పదేండ్ల కింద గ్రాండ్ గా వివాహం జరిగింది. వీరిద్దరి పెళ్లి వేడుకలు అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. 2012 జూన్ 14న ఈజంట పంజభూతాల సాక్షిగా ఒక్కటయ్యారు. స్టార్ కపుల్ గా నేటికీ హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. 
 

అయితే, చరణ్ పెళ్లి తర్వాత అభిమానులంతా మెగా వారసుడి కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఉపాసన కొణిదెల (Upasan) ప్రెగ్నెన్సీని కన్ఫమ్ చేయడంతో మెగా ఫ్యామిలీ, అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 
 

త్వరలో వారసుడిని చూడబోతున్నందుకు మెగాస్టార్ చిరంజీవి మురిసిపోతూ గుడ్ న్యూస్ ను అభిమానులతో పంచుకున్నారు. ఉపాసన సైతం వెల్లడించింది. అయితే అప్పటి నుంచి మెగా అభిమానులు కూడా చరణ్, ఉపాసనకు శుభాకాంక్షలు చెబుతూనే ఉన్నారు. 

ఈ సందర్భంగా తాజాగా అభిమానులు తమపై చూపించిన ప్రేమకు రామచరణ్ దంపుతులు వారి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. బ్యూటీఫుల్ ఫొటోలనున పంచుకుంటూ ‘అందరి ప్రేమకు కృతజ్ఞతలు’ అంటూ క్యాప్షన్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

అదిరిపోయే లుక్ లో బ్లాక్ సూట్ లో రామ్ చరణ్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఇక ఉపాసన కలర్ ఫుల్ డ్రెస్ లో తమ పెట్ ను ఎత్తుకొని ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆనందంలో మునిగితేలుతున్న ఈ జంటను చూసిన అభిమానులు మరింతగా సంతోషపడుతున్నారు. 
 

‘ఆర్ఆర్ఆర్’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు రామ్ చరణ్. అల్లూరి సీతారామరాజు పాత్రలో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చి గ్లోబల్ వైడ్ గా గుర్తింపు దక్కించుకున్నారు. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘ఆర్సీ15’ RC15లో నటిస్తున్నారు. ఆ తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్ లో నటించబోతున్నారు. 

click me!