Niharika Konidela
హీరోయిన్ గా ఎదగాలని గట్టి ప్రయత్నాల్లో ఉన్న నిహారిక గ్లామరస్ ఫోటో షూట్స్ కి తెరలేపుతుంది. ఈ క్రమంలో అమ్మడు హద్దులు దాటేస్తుంది. తాజాగా ప్యాంట్ లెస్ పోజులతో భారీ షాక్ ఇచ్చింది. మెగా డాటర్ నుండి ఇది ఊహించని పరిణామం కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
Niharika Konidela
ఇటీవల నిహారిక కొణిదెల(Niharika Konidela) అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. కొన్నాళ్లుగా భర్త వెంకట చైతన్యకు ఆమె దూరంగా ఉంటున్నారు. విడాకులు తీసుకున్నారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతుండగా స్పష్టత వచ్చింది. నిహారిక, వెంకట చైతన్య కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ వేశారు. వెంకట చైతన్య, నిహారిక విడాకుల పిటిషన్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Niharika Konidela
విడాకుల ప్రకటన అనంతరం నిహారిక సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాము. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మద్దతుగా నిలిచారు. ఈ సమయంలో కొంత ప్రైవసీ కావాలి, దయచేసి అర్థం చేసుకోగలరంటూ నిహారిక పోస్ట్ పెట్టారు.
Niharika Konidela
పెళ్లి అయ్యాక నిహారిక నటనకు దూరమైంది. మరలా ఇప్పుడు యాక్టీవ్ అయ్యింది. ఇటీవల డెడ్ ఫిక్స్సెల్స్ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేసింది. కాంటెంపరరీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది. అయితే పెద్దగా ఆదరణ దక్కించుకోలేదు.
అలాగే నిహారిక సొంత ఆఫీస్ ఓపెన్ చేసింది. ఆమెకు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఈ బ్యానర్లో వెబ్ సిరీస్లు, చిన్న చిత్రాలు చేయాలని ప్లాన్ చేస్తుంది. యువ రచయితలు, దర్శకులతో చర్చలు జరుపుతోంది.
Niharika Konidela
ఇక ఫిట్నెస్ పై శ్రద్ధ పెట్టిన నిహారిక గంటల తరబడి జిమ్ లో గడుపుతున్నారు. మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ అయిన ఒకే అమ్మాయి నిహారిక కాగా... ఒక మనసులు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి చిత్రాల్లో నటించింది. నెక్స్ట్ ఆమె పలు ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నట్లు సమాచారం. కమర్షియల్ హీరోయిన్ గా ఎదిగే ఛాన్స్ అయితే లేదు...
నిహారిక ఫ్యామిలీ మొత్తం విహారానికి ఆఫ్రికా వెళ్లారు. అడవుల్లో సఫారీ చేశారు. వరుణ్ తేజ్, నాగబాబు, నిహారిక తల్లి ఈ ట్రిప్ ఎంజాయ్ చేశారు. తమ టూర్ డైరీస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. టూర్ ముగించుకుని నిహారిక ఇండియా వచ్చినట్లు తెలుస్తుంది.