అరెరె.. ఈ పవన్ కల్యాణ్ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? 44 ఏళ్ల వయసులో ఏం చేస్తోందంటే?

Published : Oct 01, 2026, 07:30 PM IST

పవన్ కళ్యాణ్ హీరోయిన్ ను గుర్తు పట్టారా? చీరకట్టు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ తో పాటు స్టార్ హీరోతో.. తెలుగు, కన్నడ, తమిళంలో హిట్ సినిమాల్లో నటించిన ఈమెను కొత్త ఫొటోల్లో చూసి ఫ్యాన్స్ అసలు గుర్తుపట్టలేకపోతున్నారు.

PREV
15
ఫొటోలో ఉన్న నటి ఎవరో గుర్తుపట్టారా?

సినిమా తారలు ఎన్ని ఏళ్లయినా ఫ్యాన్స్ మనసులో ఎప్పటికీ ఉండిపోతారు. ఒకప్పుడు స్టార్ హీరోల పక్కన నటించి, వరుస హిట్లు కొట్టిన హీరోయిన్లను ఆడియన్స్ అంత ఈజీగా మర్చిపోలేరు. తాజాగా అలాంటి ఒక ప్రముఖ నటి లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

పైన ఫొటోలో ఉన్న నటి ఎవరో గుర్తుపట్టారా? ఒకప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఆమె. పవన్ కల్యాణ్, రవితేజ, పునీత్ రాజ్‌కుమార్ లాంటి స్టార్ హీరోల పక్కన నటించి సూపర్ హిట్లు అందుకుంది. తెలుగులోనే కాదు.. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించి తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది.

25
జాతీయ అవార్డు సాధించిన హీరోయిన్..

వందల సినిమాల్లో నటించిన ఈమె, తన అద్భుత నటనకు గానూ జాతీయ అవార్డు కూడా అందుకుంది. అంతేకాదు, తమిళనాడు ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక 'కలైమామణి' అవార్డు కూడా ఈమె సొంతం. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ తార, ఇప్పుడు అప్పుడప్పుడూ మాత్రమే స్క్రీన్‌పై కనిపిస్తోంది.

35
చీరకట్టులో మెరిసిపోతున్న నటి

సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఈమె చాలా యాక్టివ్. రీసెంట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కొన్ని కొత్త ఫొటోలు షేర్ చేసింది. అందమైన చీరకట్టులో, తలలో పూలు పెట్టుకుని చక్కటి ట్రెడిషనల్ లుక్‌లో ఉన్న ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోలు చూడగానే చాలామంది ఆమెను గుర్తుపట్టలేక కన్ఫ్యూజ్ అవుతున్నారు. పేరు తెలిశాక మాత్రం 'అరె.. ఈమె ఆమేనా?' అని ఆశ్చర్యపోతున్నారు.

మీరు గుర్తుపట్టడానికి ట్రై చేస్తున్న ఆ నటి మరెవరో కాదు.. మీరా జాస్మిన్. ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన మీరా జాస్మిన్, ఎన్నో సక్సెస్‌ఫుల్ తెలుగు సినిమాల్లో నటించి ఆడియన్స్ మనసు గెలుచుకుంది. అలాగే కన్నడలో పునీత్ రాజ్‌కుమార్ 'అరసు' సినిమాలో నటించి అక్కడి ప్రేక్షకులకూ దగ్గరైంది. తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన ఆమె నటించిన గుడుంబా శంకర్ సినిమాలో ఆమె నటన అద్భుతం అని చెప్పాలి.

45
పెళ్లి తర్వాత సినిమాలకు దూరం

హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉన్న టైమ్‌లోనే మీరా జాస్మిన్, వ్యాపారవేత్త అనిల్ జాన్ టైటస్‌ను పెళ్లి చేసుకుంది. 2014లో వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆమె, ఆ తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.

55
సెకండ్ ఇన్నింగ్స్‌లో విభిన్న పాత్రలు

మధ్య కాలంలో మీరా జాస్మిన్ కేవలం హీరోయిన్‌గానే కాకుండా సపోర్టింగ్ రోల్స్‌లోనూ నటిస్తోంది. 'విమానం', 'స్వాగ్', 'ది టెస్ట్', 'హృదయపూర్వం' లాంటి సినిమాల్లో ఆమె నటించింది. ప్రస్తుతం మీరా జాస్మిన్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయని సమాచారం. సినిమాలు తగ్గించినా, సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటోంది.

44 ఏళ్ల వయసులో మీరా జాస్మిన్ తగ్గేదే లేదంటుంది. ఎప్పటికప్పుడు తన కొత్త ఫొటోలు, వీడియోలు, పర్సనల్ విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ తరచూ హైలైట్ అవుతోంది. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన మీరా జాస్మిన్, ఇప్పుడు ఇలా ట్రెడిషనల్ లుక్‌లో కనిపించడం చూసి ఫ్యాన్స్ పాత సినిమాల రోజులను గుర్తుచేసుకుంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories