చిలుక పచ్చ చీరలో మెరిసిపోతున్న మీనాక్షి చౌదరి.. పట్టుశారీకే అందం తెచ్చిన యంగ్ బ్యూటీ

First Published | Oct 7, 2023, 4:20 PM IST

యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి వరుస చిత్రాలను లైన్ లో పెట్టింది. టాలీవుడ్ లో దూసుకుపోతోంది. మరోవైపు పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తోంది. ప్రారంభోత్సవాలకు హాజరవుతూ  సందడి చేస్తోంది. 
 

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)  టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ‘ఖిలాడీ’, ‘హిట్2’ చిత్రాలతో మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది.
 

ఈ క్రమంలో మీనాక్షి చౌదరిని పలు బ్రాండ్ సంస్థలు ప్రమోషన్స్ కు ఆహ్వానిస్తున్నాయి.తాజాగా హైదరాబాద్ వేదిక ప్రారంభమైన Goyaz సిల్వర్ అండ్ గోల్డ్ జ్యూయెల్లరీ స్టోర్ ను మీనాక్షి చౌదరి ముఖ్య అతిథిగా హాజరైన తాజాగా ప్రారంభించింది. 
 


స్టోర్ ప్రారంభోత్సవానికి మీనాక్షి చౌదరి చిలుక పచ్చ రంగు చీరలో మెరిసింది. పట్టుశారీలో మెరిసిపోయింది. ఎప్పుడూ ట్రెండీ అవుట్ ఫిట్లలో మెరిసే ఈ ముద్దుగుమ్మ  సంప్రదాయ దుస్తుల్లో వెలిగిపోతోంది. తన బ్యూటీఫుల్ లుక్ తో ఆడియెన్స్ ను ఫిదా చేసింది. 

ప్రస్తుతం ఆమె స్టోర్ ఇనాగరేషన్ కు హాజరైన లుక్ నెట్టింట వైరల్ గా మారింది. ఫొటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలా పలు బ్రాండ్ ను కూడా ప్రమోట్ చేస్తుండటంతో మీనాక్షి క్రేజ్ ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు.. 
 

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మీనాక్షి చౌదరి టాలీవుడ్ లో దుమ్ములేపుతోంది. ‘హిట్2’తో సెన్సేషన్ గా మారిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ లో అవకాశం దక్కించుకుంది. అందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటిస్తున్న ‘గుంటూరు కారం’ బిగ్ ప్రాజెక్ట్. ఇంకా షూటింగ్ దశలో ఉంది.

అలాగే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సరసన VS10లోనూ నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అప్ కమింగ్ ఫిల్మ్ ‘మట్కా’లోనూ ఈమె కథానాయిక. ‘లక్కీ భాస్కర్’ అనే మరో తెలుగు చిత్రంలోనూ నటిస్తోంది. అలాగే తమిళంలోకీ ఎంట్రీ ఇస్తూ ‘సింగపూర్ సెలూన్’ అనే మూవీలో ఛాన్స్ దక్కించుకుంది.
 

Latest Videos

click me!