నువ్వు మొదలు పెట్టేటప్పుడు అది శుభకార్యమే కానీ ముగిసేటప్పటికీ నా మెడకి చుట్టుకుని పిండ ప్రధానం వరకు వస్తుంది అని చిరాకు పడుతుంది మీనాక్షి. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు అంటూ కాళ్ళ, వేళ్ళ పడి ఆమెని బ్రతిమాలి మొత్తానికి కావ్య వాళ్ళ ఇంటికి వెళ్లడానికి ఒప్పిస్తుంది కనకం. మరోవైపు నిజం నిరూపించడం కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తూ అప్పుకి ఫోన్ చేస్తుంది కావ్య.