ట్రాజెడీ క్వీన్‌ మీనా కుమారి బయోపిక్‌లో కృతీ సనన్, బంపర్ ఆఫర్ కొట్టేసిన ప్రభాస్ హీరోయిన్

Published : Jul 15, 2023, 10:35 AM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతీ సనన్ బంపర్ ఆఫర్ కొట్టేసింది. ప్రముఖ బాలీవుడ్ నటి మీనా కుమారి పాత్రలో నటించే అవకాశం లభించింది. ట్రాజెడీ క్వీన్ పాత్రలో మెరవబోతోంది ప్రభాస్ హీరోయిన్.   

PREV
16
ట్రాజెడీ క్వీన్‌ మీనా కుమారి బయోపిక్‌లో కృతీ సనన్,  బంపర్ ఆఫర్ కొట్టేసిన ప్రభాస్ హీరోయిన్

ప్రసిద్ధ బాలీవుడ్‌ నటి, ట్రాజెడీ క్వీన్ గా పేరు ప్రఖ్యాతలు సాధించిన  మీనా కుమారి జీవితం బయోపిక్ గా  వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. బాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయేలా.. మీనాకుమారి బయోపిక్ ను తెరకెక్కించబోతున్నారని సమాచారం. ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా ఈ బయోపిక్‌ ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. 

26

ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ పనుల్లో మనీష్‌ మల్హోత్రా ఫుల్ బిజీగా ఉన్నారని తెలుస్తోంది.  ఈ ఏడాదే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారట. అంతే కాదు ఈ సినిమాలో మీనా కుమారి పాత్రలో.. కృతీ సనన్ నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఆమె ఇప్పటికే ఈ పాత్ర కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. 

36

బాలీవుడ్‌ ట్రాజెడీ క్వీన్‌గా పేరు పొందిన మీనా కుమారి 33 ఏళ్ల కెరీర్‌లో దాదాపు తొంభై సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.  ఎంతో  భవిష్యత్తు ఉన్న మీనాకుమారి.. కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే.. తన 38 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది. ట్రాజెడీ హీరోయిన్ గా మీనాకుమారికి ఎంతో పేరుంది. స్క్రీన్ మీద ఆమె ఏడుస్తుంటే... ఆమె అభిమానులు కూడా బోరున ఏడ్చేవారు.. అంత ఇష్టపడేవారు మీనాకుమారిని. 
 
46

ఇక కృతీ సనన్ ఈ పాత్రకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉంది అనుకుంటున్నారు మేకర్స్. దేశం గర్వించే గొప్పనటి పాత్రను పోషించడం గౌరవంగా భావిస్తున్నానని కృతిసనన్‌ పేర్కొంది. అయితే ఈ  పాత్రను పోషించడం కోసం ఆమె ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోంది. ఇక  ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతుంది కృతి. 

56

బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది కృతీ సనన్. తాజాగా ఆమె ప్రభాస్ జోడీగా ఆదిపురుష్ సినిమాలో నటించింది. ప్రభాస్ రాముడిగా.. కృతీ సనన్ సీతగా అద్భుతం చేశారు. ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వకపోయినా.. పర్వాలేదు అనిపించింది. ఈసినిమాలో కృతీ పాత్రకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. 
 
66
kriti sanon

click me!

Recommended Stories