Raviteja Birthday:బోయపాటి, హరీష్, శ్రీను వైట్ల.. మాస్ మహరాజ్ రవితేజ పరిచయం చేసిన 10మంది దర్శకులు

First Published Jan 26, 2022, 12:22 PM IST

హీరో రవితేజ(Ravi teja) జీవితం చాలా మందికి స్ఫూర్తి. సాధించాలన్న తపన, పట్టుదల ఉంటే ఎంతటి స్థాయికైనా చేరుకోవచ్చని రవితేజ నిరూపించాడు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వశక్తితో స్టార్ హీరోగా ఎదిగి... అసాధ్యం సుసాధ్యం చేశాడు.

ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి స్టార్ హీరో అయ్యారు. ముప్పై ఏళ్ల సినీ ప్రయాణంలో రవితేజ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. కష్టపడి పైకి వచ్చిన వాడిగా రవితేజ కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్నాడు. మనతో పాటు చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఎదగాలంటూ ఉపకమింగ్ దర్శకులను ప్రోత్సహిస్తున్నారు. రవితేజ తన  కెరీర్ లో 11 మంది దర్శకులను పరిచయం చేశారు. వారిలో కొందరు స్టార్స్ గా కూడా వెలిగిపోతున్నారు. నేడు రవితేజ బర్త్ డే (Raviteja Birthday)కాగా ఆయన పరిచయం చేసిన దర్శకులు ఎవరో చూద్దాం..


హీరోగా రవితేజ మొదటి చిత్రం నీ కోసం. ఈ సినిమాతో శ్రీను వైట్ల దర్శకుడిగా మారాడు. 1999లో వచ్చిన నీ కోసం చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.  ఆ తర్వాత ఈ కాంబినేషన్‌లో వెంకీ, దుబాయ్ శీను, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు వచ్చాయి.

రవితేజ  పరిచయం చేసిన మరో దర్శకుడు అగస్త్యన్. 2003లో ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమాతో ఈయన దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది.


రవితేజ హీరోగా 2003లో ఒక రాజు ఒక రాణి సినిమా విడుదలైంది. ఈ మూవీకి దర్శకత్వం వహించిన యోగికి ఇది మొదటి చిత్రం. తర్వాత యోగి వెంకటేష్ వంటి స్టార్ తో చింతకాయల రవి మూవీ చేశారు. 
 


రవితేజ నటించిన చిత్రాల్లో బెస్ట్ మూవీగా ఉంది నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్.  ఈ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రఫర్ ఎస్ గోపాల్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేసాడు రవితేజ. ఈ చిత్రం 2004లో వచ్చింది. కమర్షియల్ గా సక్సెస్ కాకున్నా మంచి చిత్రమన్న పేరు తెచ్చుకుంది. 

తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడిగా అఖండమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను. ఈయన్ని 2005లో భద్ర సినిమాతో దర్శకుడిగా పరిచయం చేసాడు రవితేజ.


పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ తో సినిమాలు చేస్తున్న హరీష్ శంకర్ ని దర్శకుడిని చేసింది రవితేజనే. వీరిద్దరూ  2006లో షాక్ సినిమా చేసారు.. ఈ సినిమా ఫ్లాప్ అయినా ఐదేళ్లకు మళ్లీ మిరపకాయ్‌తో లైఫ్ ఇచ్చాడు.

స్టార్ హీరోలతో వరస సినిమాలు చేస్తూ.. ఇప్పుడు చిరంజీవితో సినిమా చేస్తున్న బాబీని కూడా 2014లో పవర్ సినిమాతో పరిచయం చేసాడు రవితేజ.

రవితేజ-గోపీచంద్ మలినేనిది హిట్ కాంబినేషన్ గా ఉంది.  రవితేజకు క్రాక్, బలుపు లాంటి సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన గోపీచంద్ మలినేనిని 2010లో డాన్ శీను మూవీ దర్శకుడు అయ్యాడు. 

raviteja


 రవితేజ ఇచ్చిన అవకాశాలను దాదాపు అందరు దర్శకులు బాగానే వాడుకున్నారు. కానీ విక్రమ్ సిరికొండ మాత్రం టచ్ చేసి చూడుతో వచ్చిన అవకాశం వినియోగించుకోలేకపోయాడు. 2018లో ఈయన దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

raviteja

కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ చేస్తున్నాడు. ఈ చిత్రం మార్చ్ 25న విడుదల కానుంది.

click me!