Maryada Manish Remuneration: మర్యాద మనీష్‌ పారితోషికం అంత తక్కువా? రెండు వారాలకు ఆయనకు ఎంతంటే?

Published : Sep 21, 2025, 05:11 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9 రెండో వారం మర్యాద మనీష్‌ ఎలిమినేట్‌ అయినట్టు ఆల్మోస్ట్ కన్ఫమ్‌ అయ్యింది. అయితే రెండు వారాలు హౌజ్‌లో ఉన్న మర్యాద మనీష్‌ ఎంత పారితోషికం తీసుకుంటున్నాడంటే? 

PREV
15
రెండో వారం మర్యాద మనీష్‌ ఎలిమినేట్‌

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 9 రెండో వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన క్లారిటీ వచ్చింది. కామనర్‌గా చివర్లో హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మర్యాద మనీష్‌ ఎలిమినేట్‌ అయినట్టు తెలుస్తోంది. ఆల్‌ రెడీ మనీష్‌ ఎలిమినేషన్‌కి సంబంధించిన షూట్‌ కూడా అయిపోయిందని, ప్రస్తుతం హోటల్‌లో ఉన్నాడని, రాత్రికి ఆయన్ని బయటకు పంపించబోతున్నారని సమాచారం. ఇదిలా ఉంటే మర్యాద మనీష్‌ బిగ్‌ బాస్‌ షోకి వచ్చినందుకు ఎంత పారితోషికం తీసుకున్నారు. కామనర్స్ కి ఎంత రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారనేది తెలుసుకుందాం.

25
అగ్నిపరీక్షకి కామనర్స్ కి పారితోషికం జీరో

బిగ్‌ బాస్‌ షోకి ఆరుగురు కామనర్స్ వచ్చారు. మర్యాద మనీష్‌తోపాటు హరిత హరీష్‌, డీమాన్‌ పవన్‌, దమ్ము శ్రీజ, ప్రియా, జవాన్‌ కళ్యాణ్‌ ఉన్నారు. వీరంతా అగ్నిపరీక్ష గేమ్‌లో పాల్గొని ఎంపికయ్యారు. చాలా టాస్క్ లు ఫేస్‌ చేసి వచ్చారు. ఎంతో మంది కామనర్స్ ని ఎదుర్కొని ది బెస్ట్ గా నిలిచారు. అయితే అగ్నిపరీక్ష సమయంలో వీరికి పారితోషికం ఏం ఇవ్వలేదట. అక్కడ ఉండటానికి సంబంధించిన ఖర్చులు భరించారు. వసతి సదుపాయాలు కల్పించారట. ఈ విషయాన్ని మనీష్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

35
హౌజ్‌లో కామనర్స్ పారితోషికం ఇదే

ఇక బిగ్‌ బాస్‌ తెలుగు 9 రెగ్యూలర్‌ షోకి ఎంపికైన కామనర్స్ కి పారితోషికం అందిస్తున్నారు. సెలబ్రిటీల స్థాయిలో కాకపోయినా, మినిమమ్‌గా బాగానే ఇస్తున్నారట. ఒక్కో రోజుకి పదివేల చొప్పున ఇస్తున్నారని సమాచారం. వారానికి రూ.70వేలు పారితోషికంగా అందిస్తున్నారట. కామనర్స్ అందరికీ ఇదే పారితోషికం ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన ఇప్పుడు రెండో వారంలో ఎలిమినేట్‌ అవుతున్న మర్యాద మనీష్‌కి ఎంత పారితోషికం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.

45
మర్యాద మనీష్‌ రెండు వారాల పారితోషికం

బిగ్‌ బాస్‌ తెలుగు 9 మొదటి వారంలో సెలబ్రిటీ కంటెస్టెంట్‌ శ్రష్టి వర్మ ఎలిమినేట్‌ అయ్యారు. ఇప్పుడు రెండో వారంలో మర్యాద మనీష్‌ ఎలిమినేట్‌ అయ్యారు. ఆయనకు వారానికి డెబ్బై వేల చొప్పున రెండు వారాలకుగానూ రూ.1.40లక్షలు పారితోషికంగా అందుకుంటున్నారట. కామనర్స్ లో మనీష్‌కే తక్కువ పారితోషికం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన మొదటగా ఎలిమినేట్‌ అవుతున్నారు కాబట్టి.

55
మర్యాద మనీష్‌ ఎలిమినేషన్‌కి కారణం

ఇక స్టార్టప్‌ కంపెనీ పెట్టి చిన్న వయసులోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు మనీష్‌. ఆయన గతంలో `ఎవరు మీలో కోటీశ్వరుడు` అనే షోలో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు బిగ్‌ బాస్‌లో సందడి చేయడం విశేషం. అయితే మనీష్‌ ఎలిమినేషన్‌కి తాను నిజాయితీగా వ్యవహరించలేకపోవడం, భరణి విషయంలో సంచాలక్‌గా చేసిన మిస్టేక్స్, ఎంటర్‌టైన్‌ చేయలేకపోవడం, అతిగా ఆలోచనలు చేయడం వంటివి ఎలిమినేషన్‌ కారణమయ్యాయని సమాచారం. అయితే సెలబ్రిటీలతో పోల్చితే కామనర్స్ కి ఫాలోవర్స్ తక్కువగానే ఉంటారు. ఆడియెన్స్ కి నచ్చితేనే ఓట్లు వేస్తారు. వారికి నచ్చేలా, వారిని ఆకట్టుకునేలా చేయలేకపోతే ఎలిమినేషన్‌ తప్పదు. మనీష్‌ విషయంలో అదే జరిగిందని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories