ఆ స్టెప్పులు ఎన్నిసార్లు ట్రై చేసినా రాలేదు.. చిరంజీవి డాన్సులపై సాయిపల్లవి కామెంట్స్ వైరల్‌..

First Published | Feb 5, 2024, 6:08 PM IST

చిరంజీవి డాన్సులపై సాయిపల్లవి స్పందించింది. ఆయన సినిమాల్లోని కొన్ని పాటల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ అలా చేయడం తన వల్ల కాలేదని చెప్పడం విశేషం. 
 

మెగాస్టార్‌ చిరంజీవి డాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్‌కి డాన్సులతో ఊపు తీసుకొచ్చిన నటుడు. అసలు డాన్సులు పరిచయం చేసింది ఏఎన్నార్‌ అయితే, ఆ తర్వాత వాటికి సరైనా రూపం, కమర్షియాలిటీని తీసుకొచ్చింది చిరంజీవి అనే చెప్పాలి. టాలీవుడ్‌లో మొదటి తరం హీరోల్లో ఆయన్ని మించిన డాన్సర్‌ లేరు. చిరంజీవి అంటే డాన్స్‌, డాన్స్ అంటే చిరంజీవి అంటారు. మైఖేల్‌ జాక్సన్‌ స్టెప్పులను కూడా తెలుగు నాట పరిచయం చేశారు. 
 

తెలుగు హీరోల్లో బెస్ట్ డాన్సర్‌గా నిలిచారు. ఇప్పటికీ అదే గ్రేస్‌, అదే ఊపు, అదే ఉత్సాహంతో ఆయన డాన్సులు చేసి మెప్పిస్తున్నారు. `భోళా శంకర్‌`, అంతకు ముందు వచ్చిన `వాల్తేర్‌ వీరయ్య`లోనూ చిరంజీవి డాన్సులకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. థియేటర్లలో స్టెప్పులేశారు. అది చిరంజీవి రేంజ్‌. అయితే ఇప్పటి తరం హీరోల్లో అల్లు అర్జున్‌, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ వంటి హీరోలు ఆ డాన్సులతో అలరిస్తున్నారు. కానీ చిరంజీవి గ్రేస్‌ మాత్రం మరెవ్వరికీ సాధ్యం కాలేదని చెప్పాలి. 
 


ఇక హీరోయిన్లలో విజయశాంతి, రాధ మంచి డాన్సర్లుగా రాణించారు. ఇప్పటి తరం హీరోయిన్లలో సాయిపల్లవి బెస్ట్ డాన్సర్‌గా రాణిస్తుంది. ఆమెని డామినేట్‌ చేయడం శ్రీలీల వల్ల కూడా సాధ్యం కావడం లేదు. ఆమె డాన్సులకు చిరంజీవి కూడా ఫిదా అయ్యారు. ఆ విషయాన్ని ఓపెన్‌గానే చెప్పారు. అయితే చిరంజీవి డాన్సులపై సాయిపల్లవి స్పందించింది. ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. 
 

`ఓపెన్‌ హార్ట్ విత్‌ ఆర్కే`తో చాటింగ్‌లో సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చిరంజీవి డాన్సుల గ్రేస్‌ ఎవ్వరికీ సాధ్యం కాదని చెప్పింది. ఆయనలా చేయాలని చాలా ప్రయత్నించినా సాధ్యం కాలేదని, ఆయన చేసిన మూమెంట్స్, గ్రేస్‌ తనకు రాలేదని తెలిపింది. సాయి పల్లవి మాట్లాడుతూ, చిరంజీవి మోస్ట్ గ్రేస్‌ఫుల్‌ డాన్సర్‌ అని తెలిపింది. 
 

`ముఠామేస్త్రి` చిత్రంలోని మార్కెట్‌ లో వచ్చే టైటిల్‌ సాంగ్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది సాయిపల్లవి. ఆ పాటలోని డాన్స్ మూమెంట్స్ ని తాను చాలా సార్లు ట్రై చేసిందట. అది తనకు మాత్రం రాలేదని తెలిపింది. తాను ఏం చేసినా ఆడపిల్లనే అని, అది మగవాళ్లు చేసే రిథమ్‌ అని అది చిరంజీవికే సాధ్యమైందని తెలిపింది. 
 

అలాగే `మాస్టర్‌` సినిమాలోని `నడక కలిసిన నవరాత్రి`లోని చిరంజీవి వేసిన స్టెప్పులు కూడా తాను మర్చిపోలేనని తెలిపింది. అలాగే రెండు మూడు సినిమాల్లోని పాటల్లో చిరు స్టెప్పుల గురించి చెప్పుకొచ్చింది సాయిపల్లవి. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మెగా ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. వైరల్‌ చేస్తున్నారు. అంతేకాదు చిరంజీవి గ్రేస్‌ ఎవరికీ సాధ్యం కాదని, ఆయనలా ఎవరూ డాన్సు చేయలేరని అంటున్నారు. 

ఇదిలా ఉంటే `లవ్‌ స్టోరీ` మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి చిరంజీవి గెస్ట్ గా వెళ్లారు. ఆయన పిలవకుండానే సడెన్‌గా ఈవెంట్‌కి హాజరై అందరిని సర్‌ప్రైజ్‌ చేశారు. ఈ సందర్భంగా సాయిపల్లవి గురించి మాట్లాడారు. `భోళాశంకర్‌`లో చెల్లి పాత్రకి అడిగితే తిరస్కరించిందని, కానీ ఆమె నో చెప్పడమే తనకు సంతోషంగా ఉందని, ఎందుకంటే మున్ముందు ఆమెతో కలిసి డాన్సులు వేసే అవకాశం వస్తుందని వెయిట్‌ చేస్తున్నట్టు తెలిపింది. మరి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు పడుతుందో చూడాలి. 
 

Latest Videos

click me!