ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ ప్రామిసింగ్ మూవీ `కల్కి2898ఏడీ`. తెలుగు సినిమాల్లోనే మొదటి సైన్స్ ఫిక్షన్ మూవీ. ఇండియన్ మూవీలోనూ ఈ రేంజ్ మూవీ ఇప్పటి వరకు ఇప్పటి వరకు రాలేదని చెప్పాలి. ప్రభాస్ హీరోగా నటించడంతో ఈ మూవీ రేంజ్ పెరిగింది. దీనికితోడు భారీ కాస్టింగ్ ఈ సినిమా స్థాయిని మరింత పెంచుతుంది. భారీ కాస్టింగ్ యాడ్ కావడంతో ఇది ఇంటర్నేషనల్ రేంజ్‌కి వెళ్లిపోయింది.
గతంలో ఏ సినిమాలోనూ లేని ఆర్టిస్టులు ఇందులో నటిస్తున్నారు. పైగా 500కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందుతుంది. దీంతో సర్వత్రా భారీ అంచనాలున్నాయి. రోజుకో వార్త సినిమా స్థాయిని అమాంతం పెంచేస్తుంది. దీనికితోడు ఈ మూవీ మూడు భాగాలుగా రాబోతుందనే వార్త కూడా మరింత ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. రెండు భాగాలుగా విడుదల చేయాలని నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నారట. కానీ మూడో పార్ట్ కూడా ఉంటుందనే రూమర్ వినిపిస్తుంది.
మరోవైపు సినిమాకి మైథలాజికల్ ఎలిమెంట్లకి సంబంధం ఉంటుందని అంటున్నారు. సైన్స్ ఫిక్షన్‌కి, రామాయణం వంటి పురాణాలను జోడించి తెరకెక్కిస్తున్నారట నాగ్. అశ్విన్. ఇందులో ప్రభాస్ దేవుడు పాత్రలు పోషిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. రాముడిగా, కృష్ణుడిగా, కల్కిగా కనిపిస్తారని టాక్. ఇవన్ని సోషల్ మీడియా పుకార్లేనా? నిజంగా ఆయా ఎలిమెంట్లు ఉన్నాయా అనేది సస్పెన్స్. కానీ ఈ వార్తలు మాత్రం అందరిలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి.
kalki
ఇదిలా ఉంటే ఈ మూవీ ఇప్పుడు వాయిదా పడబోతుందనే వార్త కూడా నెట్టింట చక్కర్లు కొడుతుంది. సినిమా మాగ్జిమమ్ వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. భారీ వీఎఫ్‌ఎక్స్ ఉన్న మూవీ ఇది. అనుకున్న టైమ్‌లోపల అంటే మరో రెండు నెలల్లో వీఎఫ్‌ఎక్స్ పూర్తయితేనే అనుకున్న డేట్‌కి రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. మార్చి లోపు వీఎఫ్‌ఎక్స్ కంప్లీట్ అయితే, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి దాదాపు రెండు నెలలు ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నారట.
దీనికితోడు ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదు. నెక్ట్స్ వీక్ క్లైమాక్స్ షూట్ చేయబోతున్నారట. ఇందులో ప్రభాస్‌తోపాటు కమల్, అమితాబ్, దీపికా, దిశా, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, రానా వంటి కాస్టింగ్ అంతా పాల్గొంటారట. ఇది సినిమాకి చాలా కీలకమని, రెండో పార్ట్ కి పెద్ద హైప్ ఇచ్చేలా ఉంటుందని తెలుస్తుంది. ఈ షూటింగ్ చేయాల్సి ఉంది. ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. డబ్బింగ్ వర్క్ కూడా జరుగుతుందట.
అన్ని అనుకున్నట్టుగా జరిగి అనుకున్న టైమ్‌లో పూర్తయితేనే మే 9న ఈ మూవీని విడుదల చేయాలని టీమ్ భావిస్తుంది. లేదంటే వాయిదా పడే అవకాశం ఉందట. ఒకవేళ వాయిదా పడితే ఆగస్ట్ కి వెళ్లిపోవాలని భావిస్తున్నారట. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదంతా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, వీఎఫ్‌ఎక్స్ వర్క్ పై ఆధారపడి ఉంది. ఏం జరిగినా సినిమాని వాయిదా వేయకూడదని టీమ్ భావిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇటీవల చాలా వరకు సినిమాలు వాయిదాలు పడుతూ వస్తున్నాయి. దీంతో `కల్కి`పై కూడా అదే రూమర్స్ క్రియేట్ అవుతుgది. మరి దర్శకడు నాగ్ అశ్విన్ ఏం చేస్తాడో చూడాలి.