మంచు మనోజ్, భూమా మౌనిక వివాహ వేడుక శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. కొంత కాలంగా ప్రేమలో ఉన్న మంచు మనోజ్, మౌనిక వివాహ బంధంతో ఒక్కటి కావాలని డిసైడ్ అయ్యారు. మంచు లక్ష్మి నివాసంలో జరిగిన పెళ్ళిలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కొద్ది మంది బంధువుల సమక్షంలో జరిగినప్పటికీ మంచు మనోజ్ పెళ్లి వేడుక వైభవంగా జరిగింది.