కృష్ణ కుమార్తె ఘట్టమనేని మంజుల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి కృష్ణకి, తమ్ముడు మహేష్ కి పర్ఫెక్ట్ జోడీ అయిన హీరోయిన్ల గురించి మాట్లాడారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె ఘట్టమనేని మంజుల టాలీవుడ్ లో నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా రాణించారు. మంజుల ఏ మాయ చేసావే లాంటి సూపర్ హిట్ చిత్రాలని నిర్మించిన సంగతి తెలిసిందే. ఆమె భర్త స్వరూప్ టాలీవుడ్ లో ప్రముఖ నటుడిగా రాణిస్తున్నారు. మంజుల తరచుగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫ్యామిలీ విశేషాలని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
25
కృష్ణ కుమార్తె ఘట్టమనేని మంజుల
తండ్రి సూపర్ స్టార్ కృష్ణ, తమ్ముడు మహేష్ బాబు గురించి అభిమానులకు తెలియని అరుదైన విషయాలని రివీల్ చేస్తుంటారు. ఓ ఇంటర్వ్యూలో మంజుల మాట్లాడుతూ కృష్ణ, మహేష్ బాబు హీరోయిన్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణకి, మహేష్ బాబుకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే, వాళ్ళతో కెమిస్ట్రీ అద్భుతంగా పండించగలిగే హీరోయిన్లు ఎవరు అని అడుగగా మంజుల సమాధానం ఇచ్చారు.
35
నాన్నతో జయప్రద కెమిస్ట్రీ పర్ఫెక్ట్
నాన్నగారి పక్కన జయప్రద, శ్రీదేవి ఎక్కువ సినిమాల్లో నటించారు. చిన్నప్పటి నుంచి వాళ్లిద్దరూ నాకు బాగా తెలుసు. షూటింగ్ లొకేషన్ లో వాళ్ళతో ఆడుకునేదాన్ని. కానీ నాన్న పక్కన శ్రీదేవి కంటే జయప్రదగారే బావుంటారు. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా ఉంటుంది అని మంజుల అన్నారు.
ఇక మహేష్ బాబు విషయానికి వాస్తే.. తమ్ముడి పక్కనే సోనాలి బింద్రే అద్భుతంగా ఉంటుంది. మురారి మూవీలో వాళ్ళిద్దరి కెమిస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం. మహేష్ బాబు నటించిన సినిమాల్లో మురారి నా ఫేవరిట్ మూవీస్ లో ఒకటి అని మంజుల తెలిపారు.
55
వాళ్లిద్దరూ అంటే ఇష్టం
నాన్న, మహేష్ కాకుండా తనకు అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టం అని మంజుల పేర్కొన్నారు. మంజుల నటిగా ఆరెంజ్, సేవకుడు, మళ్ళీ మొదలైంది లాంటి చిత్రాల్లో నటించారు.