మణిరత్నం సంచలనం.. 34 ఏళ్ల బంధానికి బ్రేక్.. రెహమాన్‌ను కాదని కుర్రాడికి ఛాన్స్

Published : Mar 19, 2026, 12:53 PM IST

రోజా సినిమా నుంచి మణిరత్నం తీసిన ప్రతీ సినిమాకి ఏఆర్ రెహమానే సంగీతం ఇచ్చారు. కానీ ఇప్పుడు, తన తర్వాతి సినిమా కోసం మణిరత్నం మరో మ్యూజిక్ డైరెక్టర్‌తో పనిచేయబోతున్నారట. ఆ సంగీత తుపానును కాదని ఆయన ఎంచుకున్నది ఎవరిని?

PREV
14
మణిరత్నం మ్యూజిక్ డైరెక్టర్లు చాలా స్పెషల్..
మణిరత్నం సినిమాలంటే పాటలు కచ్చితంగా హిట్ అవుతాయి. దీనికి కారణం ఆయన పనిచేసిన సంగీత దర్శకులే. ఆయన తన కెరీర్ మొదట్లో ఇళయరాజాతో వరుసగా సినిమాలు చేశారు. వీరి కాంబోలో వచ్చిన 'అంజలి', 'మౌన రాగం', 'నాయగన్' లాంటి చిత్రాలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచాయి. ఆ తర్వాత 'రోజా' సినిమా నుంచి ఏఆర్ రెహమాన్‌తో కలిసి ప్రయాణం మొదలుపెట్టారు.
24
రోజాతో మొదలైన బంధానికి 34 ఏళ్లు..
'రోజా'తో మొదలైన వీరి ప్రయాణం, 'థగ్ లైఫ్' సినిమా వరకు సాగింది. సుమారు 34 ఏళ్లుగా విడదీయరాని ఈ కాంబో ఎన్నో హిట్ సాంగ్స్ ఇచ్చింది. మణిరత్నం సినిమాల్లోని పాటల్లో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు దాగి ఉంటాయి. వాటికి తగ్గట్టే రెహమాన్ తన మ్యాజికల్ మ్యూజిక్‌తో ప్రేక్షకులను కట్టిపడేసేవారు. మణిరత్నం తీసి ఫ్లాప్ అయిన సినిమాల్లో కూడా రెహమాన్ పాటలు సూపర్ హిట్ అయ్యేవి. అంతటి పవర్‌ఫుల్ కాంబో వీరిది.
34
రెహమాన్ కు మణిరత్నం బై బై..
అయితే, ఏఆర్ రెహమాన్ - మణిరత్నం 34 ఏళ్ల ప్రయాణానికి ముగింపు పడిందనే వార్త ఇప్పుడు కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. మణిరత్నం తన తర్వాతి సినిమాకు సాయి అభ్యంకర్‌ను సంగీత దర్శకుడిగా తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న సాయి అభ్యంకర్, యూత్ పల్స్ పట్టుకుని వరుసగా హిట్ సాంగ్స్ ఇస్తున్నాడు. అందుకే తన తర్వాతి సినిమా కూడా యువతను ఆకట్టుకునేలా ఉండాలని మణిరత్నం అతడిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
44
సినిమాపై భారీగా అంచనాలు..

మణిరత్నం తర్వాతి సినిమా ఒక ప్రేమకథ. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తుండగా, సాయి పల్లవి హీరోయిన్‌గా కనిపించనుంది. విజయ్ సేతుపతి గతంలో 'చెక్క చివంత వానం' సినిమాలో మణిరత్నంతో కలిసి పనిచేశారు. కానీ సాయి పల్లవికి మాత్రం ఇదే మొదటిసారి. తనకు సాయి పల్లవి నటనంటే చాలా ఇష్టమని మణిరత్నం చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు ఆమెతోనే సినిమా తీస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరిగాయి.

Read more Photos on
click me!

Recommended Stories