మళ్లీ మొదలెట్టిన మణికంఠ, పృధ్విది లఫూట్ గేమ్ - వేస్ట్ ప్లేయర్ అన్నది ఎవరు..? బిగ్ బాస్ సిత్రాలు..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజుకో రంగు పులుముకుంటుంది. హోరా హోరీ టాస్క్ లతో బిగ్ బాస్ ఇంట్లో సందడి వాతావరణం నెలకోంది. ఇక ఒకరిపై మరొకరు యుద్ధం ప్రకటించుకుంటున్నారు. ఈక్రమంలో కోన్ని ఆణిముత్యాలు వారి నోటి నుంచి రావడం జరిగింది. 

బిగ్ బాస్ తెలుగు హోరా హోరీ టాస్క్ లతో హీటెక్కిపోతోంది. నార్మల్ టైమ్ లో ఫ్రెండ్స్ గా ఉంటూ.. హగ్గులతో హడావిడి చేసే కంటెస్టెంట్స్.. టాస్క్ ల టైమ్ లో మాత్రం బద్ద శత్రువులుగా మారిపోతున్నారు. ఒకరిపై మరొకరు తెలియకుండానే నోరు జారుతున్నారు.  మరికొంత మంది అగ్రెసీవ్ అవుతున్నారు. '

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లియ్ చేయండి

మరీ ముఖ్యంగా పృధ్విరాజ్ గేమ్ కు అందరు భయపడుతున్నారు. ఎంత చెప్పినా గేమ్ లో బాగా అగ్రెసీవ్ అవుతున్నాడు కన్నడ నటుడు. ఇక ఈరోజు బిగ్ బాస్ కోడి గుడ్డు టాస్క్ ను  హౌస్ లో ఇచ్చారు. కోడి గుడ్లు పెట్టినప్పుడు ఇరు టీమ్ లు సేకరించడం.. వారికి ఇచ్చిన గూడులో అవి కేర్ చేయాల్సి ఉంటుంది.  


అయితే గుడ్లు కలెక్ట్ చేయడం ఒక ఎత్తు అయితే.. అవి కాపాడుకోవడం మరో ఎత్తు.. ఇతర టీమ్ సభ్యుల నుంచి వాటిని కాపాడుకునే క్రమంలో పెనుగులాటలు.. కొట్లాటలు.. కామన్ గా జరుగుతూనే ఉంటాయి. అవి శృతి మించినప్పుడే మాటలు మితిమీరుతుంటాయి. నోరు జారి మాటలు లూజ్ అవుతుంటారు. 
 

అయితే ఈ గేమ్ లో కాస్త బలంగా ఉన్న పృధ్వి అగ్రెసీవ్ గా ఆడుతున్నాడు. ఒక్కొక్కరిని తోసి నెట్టేస్తున్నాడు. అటు ఈ ఆటను తట్టుకోలేకపోయిన అభయ్.. పృధ్వి ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు.. లఫూట్ గేమ్ అంటూ విమర్శించాడు. అంతే కాదు ఈ హౌస్ లో వరస్ట్ ప్లేయర్ పృథ్వినే అంటూ కామెంట్ 
చేశాడు.

ఇక గుడ్ల కోసం విష్ణు ప్రియ, ప్రేరణ మధ్య కూడా గొడవ అయ్యింది. ఇక గేమ్ లో నిఖిల్ గ్రూప్ అయిన శక్తీ టీమ్ గెలిచిన సందర్భంగా అభయ్ టీమ్ నుంచి ఒకరిని సైడ్ చేయాలి అన్నారు. దాంతో స్ట్రాంగ్ ప్లేయర్ అయిన నబిల్ ను బయటకు పంపించేశారు.  దాంతో రేపు గేమ్ మరింత రసవత్తరంగా మాబోతోంది. 

ఇక బిగ్ బాస్ హౌస్ లో చిల్లర గొడవలు జరుగుతూననే ఉంటాయి.. దోశ కోసం విష్ణు, ప్రేరణ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. అటు యష్మీ అనవసరంగా గోంతు చించుకుంటున్నారు. ఇక తరువాత ఎపిసోడ్ లో నబిల్ సంచాలక్ గా గేమ్ ఎలా ఉండబోతోందో చూడాలి.
 

Latest Videos

click me!