ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్ తర్వాత అంతగా హైలైట్ అయిన పాత్ర జమీందార్ భార్య పాత్ర. ఈ పాత్రలో మలయాళీ నటి దివ్య పిళ్ళై నటించారు. సినిమా రిలీజ్ తర్వాత ఆమె పాత్ర గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పవిత్రంగా కనిపిస్తూ గుడులు తిరుగుతూ, పూజలు చేస్తూ సంప్రదాయంగా కనిపించే జమీందార్ భార్య ఒక్కసారిగా క్లైమాక్స్ లో విలన్ గా మారిపోతుంది.