మందిరా బేడీ మాయాజాలం, 50 ఏళ్ళ వయస్సులో కూడా.. 20ఏళ్ళలా ఫిట్ నెస్

Published : Mar 26, 2022, 09:08 PM IST

హీరోయిన్ అంటే ఏజ్ 30 దాటితే చాలు.. బ్యూటీ తగ్గిపోతుంది.. ఫిట్ నెస్ మీద ఇంట్రెస్ట్ పోతుంది..హీరోయిన్గా చాన్స్ లు తగ్గిపోతాయి. ఇక నలబై టచ్ అయ్యాయంటే చాలు ముసలితనం వచ్చేసినంతగా మారిపోతారు. కాని బాలీవుడ్ స్టార్ మందిరా బేడీ మాత్రం అందరికి షాక్ ఇస్తోంది.

PREV
16
మందిరా బేడీ  మాయాజాలం, 50 ఏళ్ళ వయస్సులో కూడా.. 20ఏళ్ళలా ఫిట్ నెస్

ప్రముఖ హిందీ నటి, ఫ్యాషన్ డిజైనర్, మాజీ టీవీ కామెంటేటర్ మందిరా బేడీ యంగ్ హీరోయిన్లకు షాక్ ఇస్తోంది. అందరూకుళ్ళుకునేవిధంగా ఫిట్ నెస్ ఛాలెంజ్ విసురుతుంది. ఇంతకీ ఆమె వయస్సు ఎంతో తెలుసా..? 50 ఏళ్లు. 50 లో కూడా 20 ఏళ్ల అమ్మాయి మాధిరి ఫిట్ నెస్ తో.. ఓరా అనిపిస్తుంది. 50 ఏళ్లు అంటే సాధారణంగా లావుగా మారుతారు లేడీస్. 

26

కొంత మంది అయితే పెద్ద పెద్ద పొట్టలతో కదలలేకుండా ఉంటారు. 40 లోనే ఈ పరిస్థితి ఫేస్ చేసిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. కాని మందిరా బేడీ అలా కాదు. ఈ వయస్సులో కూడానాజూగ్గా..సన్నగా కనిపిస్తున్నారు.  ఫ్యాషన్, ఫిట్ నెస్ కు ఆమె ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుంటారు. తన ఫిట్ నెస్ సెషన్లకు సంబంధించి వీడియోలను అభిమానులతో పంచుకోవడం కూడా ఆమెకు అలవాటు. 

36

తాజాగా ఆమె ఇటువంటిదే ఒక వీడియో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. 50 ఏళ్ల వయసులోనూ ఆమెలోని ఫిట్ నెస్ ఫ్యాషన్ చూసి ఫిదా అవుతున్నారు సోషల్ మీడియా జనాలు. డంబుల్స్ చేయడం, బాల్ తో ఎక్సర్ సైజ్ అవలీలగా చేసేస్తోంది మందిరా అంతే కాదు ఎక్సర్ సైజ్, కాఫీతో.. నన్ను లైట్ స్విచ్ లా ఆన్ చేయవచ్చు అంటోంది బాలీవుడ్ స్టార్,  

46

1994లో టెలివిజన్ సీరియల్ శాంతి లో టైటిల్ పాత్రతో మందిరా బేడీ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇది అప్పట్లో దూరదర్శన్ లో ప్రసారమైంది. ఇక రీసెంట్ ఇయర్స్ లో  సాహో సినిమాలో నెగెటీవ్ క్యారెక్టర్ లో నటించి మెప్పించారు మందిరాబేడీ. టీవీ సీరియళ్లలో  ఎక్కువగా ఆమె నటించి మెప్పించారు. 

56

 అంతే కాదు.. మందిరా బేడీ మంచి కామెంటర్ కూడా. 2003, 2007 ప్రపంచకప్ లు, 2004, 2006 చాంపియన్స్ ట్రోపీల సమయంలో మందిరా కామెంటేటర్ గా పనిచేశారు. ఆమె మల్టీ టాలెంటడ్ అని నిరూపించుకుంది,
 

66

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది మందిరా. ముఖ్యంగా ఫిట్ నెస్ సంబంధించిన వీడియోస్ తో సందడి చేస్తుంది. మందిరా ఫిట్ నెస్ కు నెటిజన్లు షాక్ అవుతుంటారు, ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. ఈ వయ్సులో ఇంతలా ఫిట్ నెస్ ను మెయింటేన్ చేయడం నిజంగా షాకింగ్ కదా.

Read more Photos on
click me!

Recommended Stories