ఇటీవల హైదరాబాద్ లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన చిరంజీవి, గరికపాటి నరసింహా రావు మధ్య చోటు చేసుకున్న సంఘటన పెద్ద దుమారమే రేపింది. చిరంజీవిని ఉద్దేశిస్తూ గరికపాటి చేసిన కామెంట్స్ తీవ్రమైన చర్చకు దారి తీశాయి. మెగా అభిమానులు గరికపాటి తీరుని పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.