Manchu Manoj: మేకర్స్ కి సవాల్‌ విసురుతున్న మంచు మనోజ్‌.. `డేవిడ్‌ రెడ్డి` కోసం కొత్త లుక్‌

Published : Mar 12, 2026, 08:00 AM IST

Manchu Manoj: మంచు మనోజ్‌ `మిరాయ్‌`లో విలన్‌గా విశ్వరూపం చూపించారు. ఇప్పుడు `డేవిడ్‌ రెడ్డి` కోసం సరికొత్త లుక్‌లోకి మారిపోతున్నారు. గూస్‌ బంమ్స్ తెప్పిస్తున్నారు. కొత్త లుక్‌ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. 

PREV
15
మంచు మనోజ్‌ విలన్‌గా శ్రీవుష్ణ/

మంచు మనోజ్‌ ఒకప్పుడు హీరోగా రాణించాడు. ప్రారంభంలో మంచి విజయాలు అందుకున్నాడు. కానీ ఆ తర్వాత సక్సెస్‌ లు రాలేదు. దీంతో కొంత కాలం గ్యాప్ తీసుకున్నాడు. అదే సమయంలో వ్యక్తిగత జీవితంలోనూ కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇలా అన్ని రకాలుగా గ్యాప్‌ తీసుకుని ఇటీవల మళ్ళీ కమ్‌ బ్యాక్‌ అయ్యారు. హీరోగా రీఎంట్రీకి ప్లాన్‌ చేసినా వర్కౌట్‌ కాలేదు. దీంతో విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. `భైరవం`లో బలమైన పాత్రలో మెరిసి మెప్పించాడు. ఇటీవల `మిరాయ్‌`లో పవర్‌ఫుల్‌ విలన్‌గా నటించి ఆకట్టుకున్నాడు.

25
డేవిడ్‌ రెడ్డిలో నటిస్తోన్న మంచు మనోజ్‌

మంచు మనోజ్‌ తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు. ఈ సినిమా అటు హీరో తేజ సజ్జా కంటే.. విలన్‌గా చేసిన మనోజ్‌కే ఎక్కువగా ఉపయోగపడిందని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే, మనోజ్‌ ఈ సక్సెస్‌ని కరెక్ట్ గా వాడుకున్నాడు. ఇప్పుడు మళ్లీ హీరోగా అలరించేందుకు వస్తున్నారు. అయితే సింపుల్‌గా రావడం లేదు. మంచు మనోజ్‌ 2.0 అనే రేంజ్‌లో రాబోతున్నారు. ప్రస్తుతం మనోజ్‌ `డేవిడ్‌ రెడ్డి` అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఆ మధ్య విడుదల చేసిన టీజర్‌ అదిరిపోయింది. హీరో పాత్రని పరిచయం చేస్తూ, ఏం చూపించబోతున్నారనే విషయాన్ని తెలియజేసేలా ఈ గ్లింప్స్ సాగింది. ఆద్యంతం ఆకట్టుకోవడమే కాదు, సినిమాపై అంచాలను పెంచింది.

35
మంచు మనోజ్‌ సరికొత్త మేకోవర్‌

ఈ క్రమంలో తాజాగా నయాలుక్‌లోకి మారిపోయారు మంచు మనోజ్‌. సరికొత్త లుక్‌లోకి ట్రాన్స్ ఫామ్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. గత మూడు వారాలుగా ఆయన జిమ్‌లో శ్రమిస్తున్నారు. వర్కౌట్‌ చేస్తూ, బాడీని మరింత ఫిట్‌గా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సరికొత్త మేకోవర్‌లోకి మారిపోయారు. ఈ సందర్భంగా నయా లుక్‌లో దిగిన ఫోటోలను ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారాపంచుకున్నాడు. ఇందులో మంచు మనోజ్‌ చెబుతూ, `మూడు వారాల క్రితం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక కంఫర్ట్ విషయంలో రాజీపడేది లేదు. ఇక సాకులు చెప్పాల‌ని అనుకోవ‌టం లేదు. కేవలం కష్టం మాత్రమే, సోమవారం స్టార్ట్ చేద్దాం, అప్పుడు, ఇప్పుడు అనుకోవడం లేదు. నిజమైన యాక్షన్‌లోకి దిగాను. దానిపై వర్క్ చేస్తున్నాను` అని తెలిపారు మనోజ్‌.

45
కెమెరా అబద్దం చెప్పదు - మంచు మనోజ్‌

 ఆయన ఇంకా చెబుతూ, `యాక్షన్ సినిమాలో మీ కోసం ఎవరూ న‌టించ‌లేరు. ప్రతి పంచ్, దెబ్బ త‌గిలిన‌ప్పుడు ప‌డిపోవ‌టం, ప్రతి దెబ్బకు మీ బాడీ సిద్ధంగా ఉండాలి. లేకుంటే వెంటనే బయటపడుతుంది. కెమెరా ఎప్పుడూ అబద్ధం చెప్పదు` అని వెల్లడించారు. ఇకపై కేవలం లుక్ కోసం కాకుండా శక్తి, సహనాన్ని పెంచుకోవడంపైనే తాను దృష్టి పెట్టానని ఆయన చెప్పారు. తన లక్ష్యం “ ధృడ‌మైన‌ వ్యక్తి”లా తయారవడం అని పేర్కొన్నాడు. ఈ అప్‌డేట్‌ను “వీక్ 3” అని పేర్కొంటూ, ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైందని, కానీ కేవలం 21 రోజుల్లోనే తాను పూర్తిగా వేరే వ్యక్తిలా అనిపిస్తున్నానని మనోజ్ చెప్పారు. చెమటలు పట్టిన దేహంతో జిమ్‌లో మంచు మనోజ్‌ దిగిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి వైరల్‌ అవుతున్నాయి.

55
డేవిడ్‌ రెడ్డి కథ ఇదే

ఇప్పుడు మంచు మ‌నోజ్ చేస్తోన్న `డేవిడ్ రెడ్డి` మూవీ తన కెరీర్‌లో అత్యంత భారీ చిత్రాల్లో ఒకటిగా రూపొందుతోంది. ఈ భారీ పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామాను హ‌నుమ రెడ్డి యెక్కంటి తెర‌కెక్కిస్తున్నారు. న‌ల్ల‌గంగుల వెంక‌ట్ రెడ్డి, భ‌ర‌త్ మోతుకూరి నిర్మిస్తున్నారు. 1897 - 1920 మధ్య బ్రిటిష్ వలస పాలన కాలంలో జరిగే కథతో డేవిడ్ రెడ్డి సినిమా రూపొందుతోంది. అణచివేతకు ఎదురు తిరిగే ఒక ధైర్యవంతుడైన యోధుడి జర్నీని ఇందులో చూపిస్తున్నారు. అంతర్జాతీయ నటి మారియా ర్యాబోషాప్కా కీలక పాత్రలో నటిస్తోంది. పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్‌ను భారీ లెవల్లో నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన డేవిడ్ రెడ్డి గ్లింప్స్‌కు అన్నీ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో 10 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. దీంతో మ‌నోజ్ న్యూ అవ‌తార్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. `డేవిడ్ రెడ్డి` సినిమాతో బిజీగా ఉన్న మంచు మ‌నోజ్‌.. ప‌లు ఇత‌ర ప్రాజెక్ట్స్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories