దర్శకుడిగా పరిచయమవుతున్న జేసన్ సంజయ్, తన 'సిగ్మా' సినిమాలో తండ్రి విజయ్ పేరును పక్కనపెట్టి, తల్లి సంగీత పేరును ఇనిషియల్‌గా వాడటం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.
తమిళ సినీ పరిశ్రమలో టాప్ స్టార్ అయిన విజయ్ కొడుకు జేసన్ సంజయ్, దర్శకుడిగా అడుగుపెడుతున్నాడు. అతను డైరెక్ట్ చేస్తున్న 'సిగ్మా' సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో సంజయ్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.
25
తండ్రి పేరును పక్కనపెట్టాడా సంజయ్?
సాధారణంగా స్టార్ల పిల్లలు తమ తండ్రి గుర్తింపుతోనే ఇండస్ట్రీలోకి వస్తారు. కానీ, జేసన్ సంజయ్ తన 'సిగ్మా' సినిమాలో తండ్రి విజయ్ (Vijay) పేరును వాడకుండా, కేవలం 'జేసన్ సంజయ్' అని మాత్రమే తనను తాను పరిచయం చేసుకుంటున్నట్లు సమాచారం.
35
విజయ్, సంగీతల మధ్య విడాకుల సమస్యలే దీనికి కారణం
తాజా సమాచారం ప్రకారం, అతను తన సంతకం, అధికారిక పత్రాల్లో "Jason Sanjay S" అని రాస్తున్నాడట. ఇందులో 'S' అంటే అతని తల్లి సంగీత స్వర్ణలింగం (Sangeetha Sornalingam) పేరు అని సినీ వర్గాలు చెబుతున్నాయి. విజయ్, సంగీతల మధ్య విడాకుల సమస్యలే దీనికి కారణం కావొచ్చని కూడా అంటున్నారు.
విజయ్‌కు వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ అతని భార్య సంగీత, చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో కేసు వేశారు. దీనికి త్రిషనే ప్రధాన కారణమని కూడా చెబుతున్నారు. సంగీత ఇప్పటివరకు నేరుగా త్రిష పేరు చెప్పకపోయినా, ఆమె ఒక నటి అని మాత్రం పేర్కొన్నారు. అంతేకాదు, విజయ్, త్రిష ఇద్దరూ ఒకే రకమైన డ్రెస్సుల్లో ఓ పెళ్లి వేడుకకు హాజరైన వీడియో అప్పట్లో సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది.
55
యాక్షన్ జానర్‌లో..
ఇదిలా ఉండగా, ఈరోడ్‌లోని ఓ ఫ్యాక్టరీకి వెళ్లిన జేసన్ సంజయ్, అక్కడి సాధారణ కార్మికులతో కలిసి నేలపై కూర్చుని దిగిన ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
విజయ్ తన భార్య సంగీతను ఓ పబ్లిక్ స్టేజీపై పరోక్షంగా 'వర్త్ కాదు' అని విమర్శించారు. దానికి కౌంటర్‌గా, కొడుకు సంజయ్ ఇలా సామాన్యులతో కలిసిపోవడాన్ని చూసి, "తండ్రి అలా అన్నా, కొడుకు తన 'వర్త్' ఏంటో నిరూపించుకున్నాడు" అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
జేసన్ సంజయ్ డైరెక్ట్ చేస్తున్న 'సిగ్మా' సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తిగా యాక్షన్ జానర్‌లో తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన 'సిగ్మా' టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.