వివాహం తర్వాత వీరిద్దరూ సంతోషంగా జీవితం సాగిస్తున్నారు. తాజాగా మంచు మనోజ్, భూమా మౌనిక.. కమెడియన్ వెన్నెల కిషోర్ హోస్ట్ గా చేస్తున్న అలా మొదలైంది షోలో పాల్గొన్నారు. ఈ షోలో వెన్నెల కిషోర్.. మౌనిక, మనోజ్ జీవితంలో అనుభవించిన కష్టాలు.. వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది లాంటి విషయాల్ని అడిగి తెలుసుకున్నారు.