సమంత, నాగచైతన్య విడిపోయి రెండేళ్లు అవుతుంది. ఇప్పుడు ఎవరికి వారు కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. అనేక స్ట్రగుల్స్ అనంతరం సమంత కూడా ఇప్పుడు మామూలుగా మారిపోయింది. వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే నాగచైతన్య.. సమంతనే ఎందుకు ప్రేమించాడనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనికి చైతూ ప్రశ్న, సమంత ఆన్సర్, దీనికి చైతూ రియాక్షన్ హైలైట్‌గా, హాట్ టాపిక్ గా మారింది. ఓ టీవీ షోస్‌లో నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ కలిసి పాల్గొన్నారు. ప్రదీప్ యాంకర్‌గా ఉన్నారు.