సాయిపల్లవి కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ ఏంటో తెలుసా? కుర్రాళ్లని ఊపేసిన డాన్స్ అది.. అస్సలు ఊహించరు!

Published : Feb 14, 2025, 06:05 PM IST

సాయిపల్లవి ఎంత మంచి డాన్సరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తను కొరియోగ్రాఫర్‌గానూ పనిచేసింది. మలయాళంలోనే తెలుగులోనూ కొరియోగ్రఫీ చేసి మెప్పించారు. ఆ సాంగ్స్ ఏంటో చూద్దాం.   

PREV
16
సాయిపల్లవి కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ ఏంటో తెలుసా? కుర్రాళ్లని ఊపేసిన డాన్స్ అది.. అస్సలు ఊహించరు!
Sai Pallavi

సాయిపల్లవి గురించి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. ఆమె అద్బుతమైన డాన్సర్‌ మాత్రమే కాదు, అద్భుతమైన నటి కూడా. ఆమె డాన్సులు చేస్తుంటే ఎలా అయితే కళ్లార్పకుండా చూస్తామో, నటనతోనూ అంతే మ్యాజిక్‌ చేస్తుంది. పాత్ర ఏదైనా తన భుజాలపై ఈజీగా మోస్తుంది. సినిమాల్లో హీరోని మించిన అసెట్‌గా నిలుస్తుంటుంది. 
 

26
Sai pallavi

ఇటీవల సాయిపల్లవి `అమరన్‌`, `తండేల్‌` చిత్రాలతో బ్యాక్‌ టూ బ్యాక్‌ విజయాలు అందుకుంది. తమిళంలో రూపొందిన `అమరన్‌` మూవీ సంచలన విజయం సాధించింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ.350కోట్లకుపైగా కలెక్షన్లని వసూలు చేసింది.

అలాగే ఇటీవల నాగచైతన్యతో కలిసి `తండేల్‌` మూవీలో నటించింది. ఈ సినిమా కూడా బాగానే ఆదరణ పొందుతుంది. వంద కోట్ల దిశగా వెళ్తుంది. ఇందులో ఎప్పటిలాగే అద్బుతమైన నటనతోపాటు డాన్సులతోనూ ఇరగదీసింది.  ఆమె పాత్రనే హైలైట్‌గా నిలిచింది. 
 

36

దీంతో ఇప్పుడు సాయిపల్లవి డాన్సుల గురించి మరోసారి చర్చ నడుస్తుంది. నెమలి నాట్యమాడిందా అనేట్టుగా ఆమె డాన్సులున్నాయంటున్నారు. అయితే సాయిపల్లవి డాన్సర్ మాత్రమే కాదు, ఆమెలో డాన్స్ కంపోజ్‌ చేసే స్కిల్స్ ఉన్నాయి. కొరియోగ్రఫీ చేయడం కూడా తెలుసు. తెలియడమే కాదు, తాను నటించిన కొన్ని పాటలకు ఆమెనే కొరియోగ్రఫీ చేయడం విశేషం.  
 

46

సాయిపల్లవి హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయిన మూవీ `ప్రేమమ్‌`. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నివిన్‌ పౌలీ, అనుపమా పరమేశ్వరన్‌, సాయిపల్లవి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం అక్కడ పెద్ద హిట్‌ అయ్యింది.

ఇందులో కాలేజీలో ప్రదర్శించే సాంగ్ బాగా పాపులర్‌ అయ్యింది. భాషలకు అతీతంగా దీన్ని యూత్‌ డాన్సులు వేసి వైరల్‌ చేశారు. అయితే ఈ పాటని సాయిపల్లవినే స్వయంగా కంపోజ్‌ చేశారు. దీనికి సెపరేట్‌గా కొరియోగ్రఫీ లేరు. తానే సొంతంగా కొరియోగ్రఫీ చేసిందట. 
 

56

సాయిపల్లవి చిన్నప్పట్నుంచి మంచి డాన్సర్‌. ఆ టాలెంట్‌తోనే ఆమె డాన్స్ షోస్‌ చేసింది. తెలుగులో `డీ 4`లో ఆమె కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. అదిరిపోయే డాన్స్ తో మెప్పించారు. ఆమె డాన్స్ ని అప్పటికే హీరోయిన్‌ అయిన సమంత కూడా అభినందించడం విశేషం.

ఆ షోలో కూడా చాలా వరకు తానే స్వయంగా డాన్సులు కంపోజ్‌ చేసి స్టేజ్‌పై చేసేది. అలా డాన్స్ లో ఆమెకి టాలెంట్‌ ఉంది. దాన్ని `ప్రేమమ్‌` సినిమాలో ఉపయోగించింది. 

66

ఇదే కాదు తెలుగు సినిమాల్లోనూ ఆమె డాన్సులు కంపోజ్‌ చేసిందట. `లవ్‌ స్టోరీ` మూవీలో `సారంగ దరియా` పాటలో చాలా వరకు స్టెప్పులను సాయిపల్లవినే కంపోజ్‌ చేసిందట.

దీంతోపాటు `శ్యామ్‌ సింగరాయ్‌` సినిమాలోని ప్రణవాలయ` పాటకి కూడా సాయిపల్లవినే కంపోజ్‌ చేసిందని సమాచారం. కానీ ఆమె క్రెడిట్‌ వేసుకోలేదు. కానీ ఈ రెండు పాటల్లో మేజర్‌ పార్ట్ ఈ లేడీ పవర్‌ స్టార్‌దే ఉందని సమాచారం. 

read more: ఎన్టీఆర్‌ సినిమా డైరెక్టర్‌కి 50 కోట్ల పారితోషికం, లాభాల్లో షేర్‌, నిర్మాతలు అడ్వాన్స్ చెక్‌.. ఎవరా దర్శకుడు ?

also read: Brahma Anandam Movie Review: `బ్రహ్మా ఆనందం` మూవీ రివ్యూ, రేటింగ్‌
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories