Manchu Manoj: మంచు మనోజ్ తన ఫ్యామిలీ వివాదంపై స్పందించారు. ఈ సందర్భంగా తన తండ్రి, అన్నపై క్రేజీగా సెటైర్లు వేశారు. అదే సమయంలో తన భార్య వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పారు.
మంచు మనోజ్ తన 43వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. మరోవైపు పెళ్లి తర్వాత కెరీర్ పరంగా జోరు పెంచారు. ఇటీవల రెండు సినిమాల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు హీరోగా `డేవిడ్ రెడ్డి` చిత్రంతో రాబోతున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. అలాగే మరికొన్ని సినిమాలు లైనప్‌లో ఉన్నాయి. అలాగే ఇటీవలే ఐక్య(AIKYA ధైర్య సేన సమితి) పేరుతో ట్రస్ట్ ని స్థాపించారు. సేవా కార్యక్రమాలను విస్తరించబోతున్నట్టు తెలిపారు.
25
సేవా కార్యక్రమాలు చేయబోతున్న మనోజ్
ఈ క్రమంలో తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ముచ్చటించారు మనోజ్. ఈ పుట్టిన రోజు స్పెషల్‌గా తన సేవా కార్యక్రమాలు విస్తరించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతానికి తన సొంత డబ్బుతోనే సేవ చేస్తానని, భవిష్యత్‌లో ఒక ప్లానింగ్ ప్రకారం సేవా కార్యక్రమాలను విస్తరిస్తామని తెలిపారు. ఇందులో ఫ్యామిలీ వివాదం గురించి రియాక్ట్ అయ్యారు. ఆ విషయాన్ని వెళ్లి ఎవరిని అడగాలో ఆయన్ని అడగండి అని చెప్పారు మనోజ్.
35
ఫ్యామిలీ వివాదంపై మంచు మనోజ్ కామెంట్
ఈ సందర్భంగా ఆయన తన ఫ్యామిలీ(తండ్రి మోహన్ బాబు, అన్న మంచు విష్ణు) పై సెటైర్లు వేశారు. ఎవరిని అడగాలో మీకు తెలుసు, వారినే అడగాలని, వెళ్లేటప్పుడు మైక్‌లు తీసుకుపోవద్దు, అలాగే హెల్మెట్లు పెట్టుకొని పోవాలి అని తెలిపారు మనోజ్. ఇలా సెటైరికల్‌గా తన వివాదాన్ని వెల్లడించారు. అదే సమయంలో మీకు న్యాయం జరిగిందా? మీరు ఎలాంటి పోరాటం చేయబోతున్నారనే ప్రశ్నకి స్పందిస్తూ, తనకు న్యాయం జరిగిందని, యూనివర్స్ రూపంలో న్యాయం జరిగిందని తెలిపారు మంచు మనోజ్. ఇలా తన ఫ్యామిలీ వివాదంపై సెటైరికల్‌గా, ఫన్నీగా స్పందించారు.
ఇక ఈ సందర్భంగా తన భార్యకి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన భార్య మౌనికా రెడ్డి రాజకీయాల్లోకి వెళ్తారని తెలిపారు. తాను రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచనలో లేదని చెప్పారు. తమది రాజకీయ కుటుంబమే గానీ, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశం లేదని చెప్పారు. అదే సమయంలో తన భార్యది రాజకీయ కుటుంబమే కాబట్టి, ఆమె రాజకీయాల్లోకి వెళ్తుందని చెప్పారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నట్టు ఆయన వెల్లడించారు.
55
మంచు ఫ్యామిలీ గొడవ ఏంటంటే?
గత ఏడాది క్రితం నుంచి తండ్రి మంచు మోహన్ బాబు, అన్నయ్య మంచు విష్ణులతో మనోజ్ గొడవ పడుతున్న విషయం తెలిసిందే. కాలేజీ, స్టూల్క్స్ లో అవకతవకలు జరుగుతున్నాయని మనోజ్ ఆరోపిస్తున్నారు. స్థానికంగా ఉన్న విద్యార్థులను భయపెడుతున్నారని, స్కూల్, యూనివర్సిటీలో స్కామ్‌లకు పాల్పడుతున్నారని మనోజ్ ఆరోపిస్తున్నారు. ఈ విషయంలోనే మంచు విష్ణుకి, మనోజ్‌కి పడటం లేదని సమాచారం. అయితే ఇదంతా ఆస్తి గొడవలని ఇన్‌సైడ్ వర్గాల టాక్.