CM Vijay Number Plate: సీఎం విజయ్‌కు డైరెక్టర్ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ముఖ్యమంత్రి అవుతాడని ముందే ఊహించారా?

Published : May 19, 2026, 05:09 PM IST

GOAT సినిమా దర్శకుడు వెంకట్ ప్రభు.. సీఎం విజయ్‌కు మర్చిపోలేని  గిఫ్ట్‌ ఇచ్చారు. ఈ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ గిఫ్ట్ లో స్పెషల్ ఏంటో తెలుసా? విజయ్ ముఖ్యమంత్రి అవుతాడని అప్పుడే అతనికి తెలుసా? 

PREV
14
సీఎం విజయ్ కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన దర్శకుడు

స్టార్ హీరో  విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. దీంతో రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన్ను కలిసి అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో దర్శకుడు వెంకట్ ప్రభు.. సీఎం విజయ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన ఓ ప్రత్యేక బహుమతి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

24
సీఎం విజయ్ కి నంబర్ ప్లేట్ కు అనుబంధం..?

2024లో విజయ్ హీరోగా 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (GOAT) సినిమా రిలీజైంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభుదేవా, ప్రశాంత్ కూడా నటించారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ సినిమాలో విజయ్ వాడిన కారు రిజిస్ట్రేషన్ నంబర్ 'TN07 CM 2026'. అప్పుడే అభిమానులు ఈ నంబర్‌ను విజయ్ రాజకీయ భవిష్యత్తుతో ముడిపెట్టారు. '2026లో విజయ్ సీఎం అవుతారు' అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

34
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్..

అభిమానులు ఊహించినట్లే 2026లో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. దీన్ని గుర్తుచేస్తూ, సినిమాలో వాడిన 'TN07 CM 2026' నంబర్ ప్లేట్‌ను దర్శకుడు వెంకట్ ప్రభు ఆయనకు బహుమతిగా ఇచ్చారు. 'ఒకప్పటి రూమర్.. ఇప్పుడు నిజమై చరిత్రగా మారింది' అని వెంకట్ ప్రభు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

44
450 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమా?

విజయ్ సీఎం అవుతారని వెంకట్ ప్రభు, ఆయన టీమ్ మొదటిసారిగా ఊహించారని ఈ గిఫ్ట్‌పై రాసి ఉంది. ఈ పోస్ట్ ఇప్పుడు విజయ్ అభిమానుల మధ్య విపరీతంగా షేర్ అవుతోంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన GOAT సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత విజయ్ నటించిన మరో సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. ఆయన చివరి చిత్రం 'జననాయగన్' ఇంకా విడుదల కావాల్సి ఉంది. కానీ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు.

Read more Photos on
click me!

Recommended Stories