ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద నెవర్ బిఫోర్ అన్నట్లుగా దూసుకుపోతోంది. కథ పరంగా పుష్ప 2 చిత్రం అంచనాలని అందుకోలేదు అని అంటున్నారు. కానీ ఎలివేషన్ సీన్లు, యాక్షన్ సన్నివేశాలని సుకుమార్ అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. దీనితో మాస్ చిత్రాలని ఇష్టపడే ఆడియన్స్ కి ఫీస్ట్ లాగా పుష్ప 2 చిత్రం ఉంది.