మంచు లక్ష్మీ దారుణంగా ట్రోలింగ్‌.. నెటిజన్లకి నటి దిమ్మతిరిగే కౌంటర్‌.. నెట్టింట వైరల్‌

First Published | Oct 18, 2021, 8:50 AM IST

మంచు లక్ష్మీపై ట్రోలర్స్ విరుచుపడ్డారు. దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. మంచులక్ష్మీనే కాదు మంచు హీరోలపై వాళ్లు ట్రోల్స్, మీమ్స్ చేయడం ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతుంది. ప్రపంచాన్ని మార్చడం తర్వాత ఫస్ట్ మంచి సినిమాలు చేయండంటున్నారు. దీనికి మంచు లక్ష్మీ కూడా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. 
 

ఇటీవల మంచు విష్ణు `మా` ఎన్నికల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. శనివారం మంచు విష్ణు ప్యానెల్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో మోహన్‌బాబు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్ముడి గెలుపుని, కొత్త బాధ్యతలను ఉద్దేశించి శుభాకాంక్షలు తెలిపింది మంచు లక్ష్మీ. 
 

ఇందులో మంచు లక్ష్మీస్పందిస్తూ, ఈ రోజు అత్యంత శుభదినం. `మా` అసోసియేషన్‌ అధ్యక్షుడిగా నా తమ్ముడు మంచు విష్ణు ప్రమాణ స్వీకారం. ప్రపంచాన్ని మార్చేందుకు ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించే ఈ కొత్త ప్రయాణానికి ఆల్‌ ది బెస్ట్ నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు ఎలాంటి మార్పులు తీసుకొస్తావో ఎదురు చూస్తుంటాను` అని తెలిపింది మంచు లక్ష్మీ. 


దీనికి నెటిజన్లు(ట్రోలర్స్) మీమ్స్ ,కామెంట్లతో రెచ్చిపోయారు. ``మా` అధ్యక్షుడు ప్రపంచాన్ని ఎలా మార్చగలడు?`,  `ప్రపంచాన్ని తర్వాత మార్చొచ్చు కానీ, ముందు మీ తమ్ముడు సినిమా స్ర్కిప్ట్ మంచివి సెలెక్ట్ చేసుకుని హిట్‌ కొట్టి తన రాతని మార్చుకుంటే ప్రపంచం గురించి తర్వాత ఆలోచించవచ్చు`, `వారిని అమెరికా ప్రెసిడెంట్‌ రేంజ్‌లో ఉందిగా`, అంతేకాదు హీరోల విభిన్న ఎక్స్ ప్రెషన్స్ తో కూడిన ఫోటోలను మీమ్స్ గా చేసి సెటైర్లు వేస్తున్నారు. 

అంతేకాదు, మరికొందరు ఇంకాస్త రెచ్చిపోయారు. `ప్రపంచానికే అధ్యక్షుడుగా ఎన్నికైన విష్ణు గారికి శుభాకాంక్షలు. రేపటి నుంచి ప్రపంచంలో ఎవ్వరైనా సరే మంచు అన్న అనుమతి లేనిదే తిండి తినడం, ఊపిరి పీల్చడం, నిల్చోవడం, కూర్చవడం, దగ్గడం, తుమ్మడం, పిత్తడం లాంటి పనులు చేయరాదు` అంటూ కామెంట్లు పెడుతున్నారు.
 

దీంతో దీనిపై ఎట్టకేలకు స్పందించింది మంచు లక్ష్మీ. నెటిజన్లకి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది.  `ఇక చాలు ఆపండి. ఎప్పుడు చాన్స్ వస్తుందా.. ఎవరిని ఎప్పుడు, ఎలా కామెంట్ చేద్దామా? అని చూస్తుంటారు. నటీనటులకు సినిమానే ప్రపంచం. విషయాన్ని అర్థం చేసుకోండి. నా ఉద్దేశం మీరనుకునే ప్రపంచం కాదు. `మా` అసోసియేషన్ అనే ప్రపంచాన్ని మార్చడం` అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. 
 

మంచు లక్ష్మీ కౌంటర్‌ని కూడా వదలడం లేదు నెటిజన్లు. ఆమె మరో ట్వీట్‌కి కూడా తమదైన కామెంట్లతో రెచ్చిపోతున్నారు. మంచు ఫ్యామిలీ హీరోలపై సెటైర్లు వేస్తున్నారు. మొత్తంగా `మా` రచ్చ ఇప్పుడు నెట్టింట రచ్చగా మారింది. 

ఇదిలా ఉంటే మంచు లక్ష్మీ కూడా ఈ మధ్య గ్లామర్‌ ఫోటోలతో రెచ్చిపోతుంది. క్లీవేజ్‌ అందాలతో ఫోటోలకు పోజులిస్తూ కుర్రాళ్లకి మతిపోగొడుతుంది. కుర్ర హీరోయిన్లకి కూడా షాకిస్తుంది. ఈ అమ్మడి గ్లామర్‌ ఫోటోలు ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. 

Latest Videos

click me!