ముంబైకి మకాం మార్చిన మంచు లక్ష్మి.. బర్త్ డే తర్వాత కీలక నిర్ణయం.!

First Published | Oct 12, 2023, 8:29 PM IST

మంచు లక్ష్మి రీసెంట్ గానే తన పుట్టిన రోజు వేడుకలను ముంబైలో గ్రాండ్ గా జరుపుకుంది. బర్త్ డే తర్వాత స్టార్ కిడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పూర్తిగా ఆమె ముంబైకి షిప్ట్ అవ్వడం ఆసక్తికరంగా మారింది. 
 

స్టార్ కిడ్, మంచు లక్ష్మి (Manchu Lakshmi)  నటిగా, ప్రొడ్యూసర్ గా గుర్తింపు దక్కించుకున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా తనదైన శైలిలో ముందుకు వెళ్తొంది. నటిగా విభిన్న పాత్రలు పోషిస్తూ వస్తోంది. చివరిగా ‘పిట్టకథలు’, ‘మాన్ స్టర్’ వంటి చిత్రాలతో అలరించింది. 
 

ప్రస్తుతం తన అప్ కమింగ్ ఫిల్మ్ ‘ఆదిపర్వం’ (Adiparvam) పై ఫోకస్ పెట్టింది. ఈ చిత్రం నుంచి ఆమె బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. పోస్టర్ లో మంచు లక్ష్మి లుక్ భయంకరంగా ఉంది. చిత్రంతో ఆమె పెర్ఫామెన్స్ అదిరిపోతుందనే అనిపిస్తోంది. ఇక పుట్టిన రోజు సందర్భంగా వచ్చిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.


ఇదిలా ఉంటే.. తన బర్త్ డే బష్ ను మంచు లక్ష్మి ముంబైలో గ్రాండ్ గా నిర్వహించింది. తాప్సీ, రకుల్ ప్రీత్ సింగ్, పలువురు సెలబ్రెటీలు హాజరై సందడి చేశారు. అయితే బర్త్ డే తర్వాత మంచు లక్ష్మి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పూర్తిగా ముంబైలోనే ఉండబోతున్నట్టు ప్రకటించింది. ఆవిడే స్వయంగా తెలిపింది. 
 

ముంబై, న్యూ సిటీ,  న్యూ వరల్డ్.. ఈ లైఫ్ ను ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నాపై నమ్మకముంచి ప్రేమాభిమానాలు కురిపిస్తున్న అభిమానులందరికీ ధన్యవాదాలు’ అంటూ పేర్కొంది. ఇక రీసెంట్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ముంబైకి షిఫ్ట్ కావడానికి గల  రాణాలను తెలియజేసింది. 

సౌత్ లో చాలా రకాల పాత్రల్లో నటించినట్టు తెలిపింది. కానీ అవి లిమిట్స్ మేరకే ఉన్నాయని, ప్రస్తుతం తను విభిన్న పాత్రల్లో నటించాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం ముంబైకి షిఫ్ట్ అయినట్టు చెప్పారు. హిందీలోని సినిమాలు, వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. 
 

పూర్తిగా నటిగానే కెరీర్ పై ఫోకస్ పెట్టినట్టు చెప్పారు. మంచి పాత్రల్లో నటించేందుకు, తగిన అవకాశాల కోసం ప్రయత్నించినట్టు చెప్పారు. ఆఫర్స్  దక్కించుకునేందుకు ఆడిషన్స్ కు కూడా సిద్ధమేనన్నారు. ముంబైలో స్టార్ కిడ్ కాదని, కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటున్నట్టు వివరించింది. త్వరలో ‘ఆదిపర్వం’తో అలరించబోతోంది. 

Latest Videos

click me!