నిషా తెప్పించే చూపులు.. ఐశ్వర్య రాజేశ్ మత్తు కళ్లలోకి చూస్తే అంతే.. పిక్స్

First Published | Oct 12, 2023, 7:43 PM IST

డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ ఇటీవల సోషల్ మీడియాలో నయా లుక్స్ లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తూనే.. మరోవైపు గ్లామర్ మెరుపులూ మెరిపిస్తోంది. లేటెస్ట్ లుక్స్ తో మతులు పోగొడుతోంది.  
 

గ్లామర్ షోకు డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh)  చాలా దూరంగా ఉంటుంది. ఎప్పుడూ సంప్రదాయ లుక్స్ లోనే ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంటోంది. ఎలాంటి ఫంక్షన్ అయినా ట్రెడిషనల్ వేర్స్ లోనే దర్శనమిస్తూ ఆకర్షిస్తుంటుంది. ఇటీవల ఐశ్వర్య రాజేశ్ నయా లుక్స్ తో అదరగొడుతోంది.
 

ట్రెడిషనల్ లుక్ లోనే దర్శనమిస్తున్నా తన అందంతో ఆకట్టుకుంటోంది. అలాగే గ్లామర్ మెరపులతోనూ మైమరిపిస్తూ వస్తోంది. పద్ధతిగానే కుర్ర గుండెల్ని కొల్లడుతోందీ ముద్దుగుమ్మ ఇటీవల వరుసగా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. తాజాగా మరిన్ని బ్యూటీఫుల్ ఫొటోలను పంచుకుంది. 
 


లేటెస్ట్ గా స్టన్నింగ్ ఫొటోలను పంచుకుంది. క్లోజప్ షాట్ లో, టాప్ యాంగిల్లో ఫొటోలకు ఫోజులిస్తూ కట్టిపడేసింది. ట్రెండీ వేర్ లో కిర్రాక్ స్టిల్స్ తో అట్రాక్ట్ చేసింది. మత్తు కళ్లతో, నిషా తెప్పించే చూపులతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. 

మరోవైపు షోల్డర్ అందాలతోనూ మైమరిపించింది. రూపసౌందర్యంతోనూ కట్టిపడేసింది. డస్కీ బ్యూటీ లేటెస్ట్ ఫొటోస్ కు అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఐశ్వర్య అందాన్ని పొగడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. గ్లామర్ షోకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని ఐశ్వర్య.. ఇలా తన బ్యూటీఫుల్ ఫొటోస్ మాత్రం అలరిస్తోంది. 
 

ఇక ఐశ్వర్య తమిళ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ టాలెంటెడ్ హీరోయిన్ విభిన్న పాత్రలు పోషిస్తూ వస్తోంది. ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ సంపాదించుకుంటోంది. ఇటు తెలుగులోనూ ‘కౌసల్య కృష్ణమూర్తి’, ‘మిస్ మ్యాచ్’, ‘వరల్డ్ ఫోమస్ లవర్’, ‘టక్ జగదీష్’, ‘రిపబ్లిక్’ వంటి చిత్రాలతో అలరించింది. 

ప్రస్తుతం తమిళం, మలయాళం చిత్రాలతో బిజీగా ఉంది. నెక్ట్స్  విక్రమ్ నటించిన ‘ధృవ నక్షత్రం’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళంలో రెండు చిత్రాలు, మలయాళంలో మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. ఈ క్రమంలో తన సినిమాలనూ ప్రమోట్ చేసుకుంటూ వస్తోంది. 

Latest Videos

click me!