ఓపెన్ షోల్డర్స్ తో దర్శనమిచ్చిన మంచు లక్ష్మి.. షాకింగ్ లుక్ పై నెటిజన్ల క్రేజీ కామెంట్స్

First Published | Apr 30, 2023, 7:18 PM IST

టాలీవుడ్ నటి, ప్రొడ్యూసర్ మంచు లక్ష్మి (Manchu Lakshmi) స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చింది. లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. నెెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.   
 

సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి తెలుగువారికి సుపరిచితమే. నటిగా, ప్రొడ్యూసర్ గా, టెలివిజన్ ప్రజెంటర్ గా ప్రేక్షకులను అలరించింది. విభిన్నమైన పాత్రలు పోషించి కూడా అలరించింది. 
 

మంచు లక్ష్మి ఇటీవల సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తున్నారు.  ఎప్పటినుంచో తన వ్యక్తిగత విషయాలను, మంచు ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ వస్తుంది.  ఈక్రమంలో కొద్దిరోజులుగా  నయా లుక్స్ లోనూ మెరుస్తూ ఆకట్టుకుంటోంది. 
 


అదిరిపోయే అవుట్ ఫిట్స్, శారీ లుక్ లో దర్శనమిస్తూ అట్రాక్ట్ చేస్తున్నారు. కొత్తదనం చూపిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మంచు లక్ష్మి. ఈ సందర్భంగా  వరుసగా పోస్టులు పెడుతూ ఆసక్తికరంగా  మారుతున్నారు.  
 

తాజాగా మంచు లక్ష్మి షాకింగ్ లుక్ లో కనిపించారు. నయా లుక్ తో అదరగొట్టారు. తన షేర్ చేసిన ఆ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్లు స్పందిస్తూ లైక్స్, కామెంట్లతో మరింతగా వైరల్ చేస్తున్నారు.  మంచు లక్ష్మి  ఊహించని విధంగా ఫొటోషూట్ చేసి ఆశ్చర్యపరిచారు. 
 

లేటెస్ట్ లుక్ లో ఆమె ఓపెన్ షోల్డర్స్ తో గ్లామర్ మెరుపులు మెరిపించారు.  డార్క్ రూమ్ లో ఓపెన్ షోల్డర్స్ గౌన్ లో సిట్టింగ్ పొజిషన్ లో ఫొటోకు ఫోజిచ్చారు. గ్రే షేడ్ లుక్ లో ఆకట్టుకున్నారు. ఈ ఫొటోను షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చారు. 

‘చీకటిలో వెలుతురును వెతుకుతూ’ అంటూ ఇచ్చిన క్యాప్షన్ ఆసక్తికరంగా మారింది. మంచు లక్ష్మి  షాకింగ్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కొందరు నెటిజన్లు  స్టన్నింగ్ అంటూ ఎంకరేజ్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ‘ఎందుకివ్వన్నీ’ అంటూ లక్ష్మికి కామెంట్లు పెడుతున్నారు. రీసెంట్ గా ఆమె మలయాళ ఫిల్మ్ ‘మాన్ స్టార్’లో నటించింది.
 

Latest Videos

click me!