మంచు ఫ్యామిలీ వివాదంః మళ్లీ అగ్గిరాజేసిన మంచు మనోజ్‌.. అసలు కారణం ఇదేనా?

First Published | Jan 15, 2025, 10:14 PM IST

మంచు ఫ్యామిలీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మంచు మనోజ్‌ ఎంబీ యూనివర్సిటీ సందర్శనకు వెళ్లడంతో వివాదం మళ్లీ రాజుకుంది. మరి ఇంతకి మనోజ్‌ ఎందుకు వెళ్లాడు? మంచు ఫ్యామిలీలో అసలేం జరుగుతుంది?
 

మంచు ఫ్యామిలీలో గత నెలలో వివాదం చోటు చేసుకుంది. ఫ్యామిలీ గొడవలు పోలీస్‌ స్టేషన్‌ వరకు వచ్చాయి. పెద్ద రచ్చ రచ్చ అయ్యింది. కేసులు, కోర్ట్ ల వరకు వెళ్లింది. ఈ క్రమంలో సెటిల్‌ అయ్యిందని, గొడవ సర్దుమనిగిందని అనుకున్నారు. కానీ సడెన్‌గా ఇప్పుడు అగ్గిరాజేస్తుంది. వివాదం మళ్లీ స్టార్ట్ అయ్యింది. మంచు మనోజ్‌ సరికొత్త వివాదానికి తెరలేపాడు. ఆయన మోహన్‌బాబు యూనివర్సిటీని సందర్శించడం కోసం వెళ్లడంతో ఈ వివాదం మళ్లీ రాజుకుంది. మొదట రేణిగుంట వివామానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడి నుంచి ర్యాలీగా యూనివర్సిటీకి వెళ్లాడు.
 

మంచు మనోజ్‌ని యూనివర్సిటీలోకి పోలీసులు అనుమతించలేదు. ట్రస్ట్ వివాదం కేసు కోర్ట్ లో ఉన్న నేపథ్యంలో మంచు మనోజ్‌ కూడా అర్థం చేసుకున్నాడు. వెనుతిరిగాడు. అయితే తన తాతయ్య, నానమ్మ సమాధులను కూడా సందర్శించడానికి వీలు లేకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

మనోజ్‌ లోపల ఉన్నవారిపై గట్టిగా అరిచాడు. పోలీస్‌ పై అధికారులతో మాట్లాడారు. మొత్తంగా పోలీసుల సపోర్ట్ తో మంచు మనోజ్‌ లోపలికి వెళ్లి తాత, నాన్న సమాధులను సందర్శించి దెండం పెట్టుకుని వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనని ఎందుకు అడ్డుకుంటున్నారనేది ప్రశ్నించారు మంచు మనోజ్‌.

తనని చూసి ఎందుకు భయపడుతున్నారనేది ఆయన అడిగాడు. సమస్య ఏంటో అర్థం కావడం లేదన్నాడు. ఏదైనా ఉంటే చర్చించడానికి తాను సిద్ధమే అంటున్నాడు. ఆస్తి కోసం గొడవ కాదని స్పష్టం చేశాను, ఆస్తుల కోసం తాను గొడవ పడను అని తేల్చి చెప్పారు. 
 


ఈ సందర్భంగా ప్రధానంగా కొన్ని విషయాలను లేవనెత్తాడు మంచు మనోజ్‌. యూనివర్సిటీ పరిధిలో, ట్రస్ట్ పరిధిలో కొంత అన్యాయం జరుగుతుందన్నారు. ప్రైవేట్‌ హాస్టల్స్ లో ఉన్న విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. హాస్టల్స్ ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని, ఇక్కడి స్థానిక ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నారని మనోజ్‌ ఆరోపించారు.

దాన్ని ఆపమని ఆయన అడిగినట్టు తెలిపారు. ఇది అన్యాయమని, దీనిపై కూర్చొని మాట్లాడదామని చెప్పాడట. అయినా వినడం లేదని, ఇదే విషయంపై తాను ఫిర్యాదు చేశాను, మెసేజ్‌ చేశానని, ఈ విషయంలోనే గొడవ జరుగుతుందన్నారు. 
 

తాను ఆరోపించడం వాళ్లకి నచ్చడం లేదని, అందుకే తనని ఇంట్లోకి కూడా రానివ్వడం లేదని తెలిపారు. అమ్మకి బ్రెయిన్‌ వాష్‌ చేసి దొంగ సంతకాలు పెట్టించారని ఆరోపించారు. అలాగే ఇంట్లో జెనరేటర్‌లో చెక్కర పోశారని, కరెంట్‌ తీయించే ప్రయత్నం చేశారని, అమ్మ నిలదీయడంతో అక్కడితో ఆగినట్టు చెప్పారు. ఈ గొడవలోకి తన భార్యని తీసుకురావడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మంచు మనోజ్‌.

ఈ గొడవలోకి తన భార్యని ఎందుకు తీసుకొస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఆమెకి అమ్మానాన్న లేరు, తనుకు అన్నీ తానే అని, అండగా ఉంటానని, కానీ ఆమెని గొడవలోకి లాగడం తనకు నచ్చలేదని, ఆ విషయంలోనే తాను హర్ట్ అయినట్టు తెలిపారు. ఈ విషయంపై తాను పోరాడతానని, స్థానికులకు, ఫ్యాన్స్ కి అండగా ఉంటానని , విద్యార్థులకు అండగా ఉంటానని తెలిపారు. ఎవరూ భయపడవద్దన్నారు. 

 అయితే ఇప్పుడు మనోజ్‌ ఎందుకు రియాక్ట్ కావాల్సి వచ్చిందనేది ఆసక్తికరంగా, సస్పెన్స్ గా మారింది. గొడవ సర్దుమనిగిందని అంతా భావించిన నేపథ్యంలో మంచు మనోజ్‌ సడెన్‌గా బయటకు రావడం, యూనివర్సిటీకి వెళ్లడం, తాతయ్య, నాన్నమ్మ సమాధులను సందర్శించుకోవాలనుకోవడం వెనుక ఆంతర్యమేంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవలే మంచు మోహన్‌ బాబు, మంచు విష్ణు ఫ్యామిలీతో కలిసి సంక్రాంతి సెలబ్రేట్‌ చేసుకున్నారు. వారంతా హ్యాపీగా గడిపారు. కానీ అక్కడ మనోజ్‌ లేరు. దీంతో వివాదం సమసిపోలేదని అర్థమయ్యింది. ఇప్పుడు మంచు మనోజ్‌ యూనివర్సిటీకి రావడంతో ఈ వివాదం మరోసారి హాట్‌ టాపిక్‌ అయ్యింది. 

గతంలోనే మంచు మనోజ్‌.. యూనివర్సిటీలో, స్కూల్స్, కాలేజీలో అవకతవకలు జరుగుతున్నాయంటూ, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. సోషల్‌ మీడియా ద్వారా సీఎంలకు, డిప్యూటీ సీఎంలకు, సీఎస్‌లకు ఆయన సోషల్‌ మీడియా ద్వారా ట్యాగ్‌ చేస్తూ అవకతవకలకు సంబంధించిన అంశాలను పేర్కొంటూ లెటర్‌ రాశారు. దీంతో వివాదం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో మంచు మనోజ్‌కి, మోహన్‌బాబుకి గొడవ జరిగిందన్నారు. మనోజ్‌ని మోహన్‌బాబు కొట్టాడని, మనుషులతో కొట్టించాడనే ఆరోపణలు వచ్చాయి. 
 

Manchu Manoj

మంచు మనోజ్‌ సైతం గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో వివాదం పెద్దది అయ్యింది. తనపైకొందరు దాడి చేశారని మనోజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో తనకు ప్రాణహానీ ఉందంటూ మోహన్‌బాబు సైబరాబాద్‌ కమిషనర్‌కి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో మనోజ్‌ని హైదరాబాద్‌లోని ఇంటికి మోహన్‌బాబు అనుమతించలేదు. ఖాళీ చేయాలని డిమాండ్‌ చేశాడు. అలాగే ఓ వాయిస్‌ మెసేజ్‌ కూడా విడుదల చేశారు. మనోజ్‌ తాగుతూ వస్తున్నాడని, తప్పు మీద తప్పు చేస్తున్నాడని, ఇక  సహించేది లేదని తెలిపారు. అందుకే నా ఇంట్లో ఉండటానికి వీళ్లేదన్నారు. మనోజ్‌ రాకుండా గేటుకి లాక్‌ చేశాడు. దాన్ని పగలగొట్టకుని లోపలికి వెళ్లాడు మనోజ్‌.

ఈ క్రమంలో ఆగ్రహానికి గురయిన మోహన్‌బాబు బయటకు వస్తూ మీడియాపై దాడి కూడా చేశారు. దీంతో ఇది పెద్ద సంచలనంగా మారింది. మంచు ఫ్యామిలీ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్ అయ్యింది. అనంతర పరిణామాలతో సైలెంట్‌ అయ్యారు. ఇలా సైలైట్‌ కావడంతో గొడవ సెటిల్‌ అయ్యిందని భావించారు. కానీ ఇప్పుడు మనోజ్‌ యూనివర్సిటీ ఎంట్రీతో మరోసారి రచ్చ రచ్చ అవుతుంది. మరి ఈ వివాదం ఎప్పుడు సమసిపోతుంది? ఈ గొడవకు ఇంకా వేరే కారణాలున్నాయా? అనేది తెలియాల్సి ఉంది. 

read more: నా భార్యని గొడవలోకి లాగారు, తనకు ఎవరూ లేరు, అన్నీ నేనే, ఎవరినీ వదిలిపెట్టను.. మంచు మనోజ్‌ వార్నింగ్‌

also read: బాలకృష్ణ వంద కోట్ల సినిమాలు ఎన్నో తెలుసా? సీనియర్‌ హీరోల్లో బాలయ్య రేర్‌ ఫీట్‌

Latest Videos

click me!