MSG 26th Day Collections: `మన శంకర వర ప్రసాద్‌ గారు` ఓటీటీ డేట్‌.. చిరంజీవి సినిమా 26 రోజుల కలెక్షన్లు

Published : Feb 07, 2026, 12:00 PM IST

చిరంజీవి హీరోగా వచ్చిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` వచ్చే వారం ఓటీటీలోకి రాబోతుంది. అయినా బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతుంది. 26వ రోజు ఈ మూవీకి కలెక్షన్లు పెరగడం విశేషం. 

PREV
15
థియేటర్లలో మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ రచ్చ

చిరంజీవి నటించిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ ఇప్పటికీ థియేటర్లలో రన్‌ అవుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 26 రోజులు పూర్తి చేసుకుంది. అయినా మంచి వసూళ్లని రాబట్టడం విశేషం. వీక్‌ డేస్‌తో పోల్చితే వీకెండ్స్ లో వసూళ్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు శుక్రవారం కూడా ఈ చిత్రానికి కలెక్షన్లు పెరగడం ఆశ్చర్యపరుస్తోంది.

25
మన శంకరవర ప్రసాద్‌ గారు 26 రోజుల కలెక్షన్లు

శుక్రవారం ఈ మూవీ ఇండియాలో సుమారు యాభై లక్షల వరకు వసూళ్లు చేసింది. ఇప్పటికీ ఆ స్థాయి వసూళ్లంటే మామూలు విషయం కాదు. అయితే ఇది సిటీస్‌లో ఆల్మోస్ట్ క్లోజ్‌ అయ్యింది. కానీ రూరల్‌లో మాత్రం ఆడుతుండటం విశేషం. ఈ శనివారం, ఆదివారం కూడా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. ఆడితే ఈ రెండు రోజులు ఆడుతుంది. ఇక సోమవారం నుంచి క్లోజ్‌ కానుందని చెప్పొచ్చు. మన శంకర వర ప్రసాద్‌ మూవీ ఈ రెండు రోజులతో థియేట్రికల్‌గా క్లోజ్‌ కానుంది.

35
మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ కలెక్షన్లు

ఇక ఇప్పటి వరకు ఈ చిత్రానికి `టాలీవుడ్‌ టూ బాలీవుడ్‌ ``అందించిన లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా రూ.296.40కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. అంటే .180కోట్ల షేర్‌ వచ్చింది. ఈ సినిమాకి రూ.122కోట్ల బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ ఉంది. దీంతో రూ.58కోట్ల లాభాలు గడించింది. చిరంజీవి కెరీర్‌లోనే ఇది అతిపెద్ద బ్లాక్‌ బస్టర్‌గా చెప్పొచ్చు. పాన్‌ ఇండియా చిత్రాలు పక్కన పెడితే రీజినల్‌ మూవీస్‌లో టాలీవుడ్‌లో ఇది రికార్డుగా, ఇండస్ట్రీగా హిట్‌గా చెప్పాలి.

45
మన శంకర వర ప్రసాద్‌ గారు ఓటీటీ రిలీజ్‌ డేట్‌

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ని సర్‌ప్రైజ్‌ చేయబోతుంది. త్వరలోనే ఓటీటీలోకి వస్తుంది. ఈ నెల 11 నుంచే జీ5లో స్ట్రీమింగ్‌ కాబోతుంది. కరెక్ట్ గా నెల రోజులకు ఈ చిత్రం ఓటీటీలో రానుంది. థియేట్రికల్‌గా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీలో ఎంత వరకు ఆదరణ పొందుతుందో చూడాలి. థియేట్రికల్‌గా చాలా వరకు చూశారు. దీంతో ఓటీటీలో దీనికి దెబ్బపడే ఛాన్స్ ఉంది.

55
పండక్కి ఇంటిల్లిపాదిని అలరించిన చిరంజీవి మూవీ

చిరంజీవి హీరోగా, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` లో నయనతార హీరోయిన్‌గా నటించింది. వెంకటేష్‌ స్పెషల్‌ రోల్‌ చేశారు. చిరు కూతురు సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మించారు. సంక్రాంతి పండక్కి మంచి ఫ్యామిలీ, ఫన్‌ కంటెంట్‌తో ఈ మూవీని రూపొందించారు అనిల్‌. మహిళా ప్రేక్షకులకు, చిరంజీవి అభిమానులకు, అలాగే చిన్నపిల్లల్ని అలరించేలా ఈ మూవీ ఉండటంతో అన్ని వర్గాల ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. పెద్ద హిట్‌ చేశారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories