ఆరెంజ్‌ టాప్‌లో ఘాటు రేపుతున్న మల్లు భామ అందాలు.. కత్తిలాంటి చూపులతో హృదయాలను గుచ్చేస్తున్న మాళవిక

First Published Jun 3, 2023, 5:47 PM IST

మల్లు బ్యూటీ మాళవిక మోహనన్‌.. హద్దులు చెరిపే అందాల షోతో హాట్‌ టాపిక్‌ అవుతుంటుంది. మల్లు భామ కంటే బోల్డ్ బ్యూటీగా పాపులర్‌ అయ్యింది. నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది. 
 

మాళవిక మోహనన్‌.. ప్రస్తుతం వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. ఆమె ఆరెంజ్‌ టాప్‌ ధరించి హోయలు పోయింది. ఓ ఆశ్రమాన్ని తలపించే చోట ఫోటో షూట్‌ చేసింది. అయితే ఇందులో ఆమె చూపులు మాత్రం కుర్రాళ్ల హృదయాలను గుచ్చేస్తుండటం విశేషం. 

మాళవిక ప్రస్తుతం నార్త్ అమెరికాలో ఉంది. అక్కడ మెరాకోలో గల అట్లాస్‌ మౌంటేన్స్ వద్ద రిలాక్స్ అవుతుంది. అక్కడ అందాలను, ఆ ఆహ్లాదాన్ని పంచే ఇళ్లని చూస్తూ ఎంజాయ్‌ చేస్తుంది. అక్కడ దిగిన ఫోటోలను పంచుకుంది మాళవిక మోహనన్‌.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇందులో మాళవిక మోహనన్‌ లుక్స్ మాత్రం మైండ్‌ బ్లోయింగ్‌. చూపులతోనే మత్తెక్కించేలా ఉంది. అందాల ప్రదర్శన అవసరం లేదు, మాళవిక ఇలా చూస్తే కుర్రాళ్ల కొంప కొల్లేరే అనేలా, ఆమెకి ఫిదా అయిపోవాల్సిందే అనేలా ఆమె చూపులుండటం విశేషం. 
 

మలయాళ భామ మాళవిక.. ఇప్పుడిప్పుడు కెరీర్‌ పరంగా ఒక్కో మెట్టు ఎక్కుతుంది. ఆమె చేతిలో ఇప్పుడు పెద్ద సినిమాలే ఉన్నాయి. తమిళంలో విక్రమ్‌తో `తంగలాన్‌` సినిమాలో నటిస్తుంది. ఇందులో డీ గ్లామర్‌ లుక్‌లో కనిపించబోతుంది. మరోవైపు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ప్రభాస్‌తో సినిమా చేస్తుంది. `సూపర్‌ డీలక్స్‌` లో హీరోయిన్‌గా కనిపించనుంది. తెలుగు ఆడియెన్స్ ని పలకరించబోతుంది. హిందీలో `యుద్ర` సినిమా చేస్తుంది.

మలయాళంలో ఇటీవల `క్రిస్టీ` చిత్రంతో అలరించింది. ఇది పెద్దగా మెప్పించలేకపోయింది. దీంతో ఇప్పుడు ప్రభాస్‌, విక్రమ్‌లపైనే ఆశలన్నీ పెట్టుకుంది. ఈ సినిమాలు హిట్‌ అయితే పాన్‌ ఇండియన్‌ హీరోయిన్‌ అయిపోతుంది మాళవిక. ఆమె నెక్ట్స్ లెవల్‌ హీరోయిన్‌ అవుతుంది. అదే సమయంలో సీనియర్‌ స్టార్‌ హీరోలకు కేరాఫ్‌గానూ నిలుస్తుంది. 
 

ఇక సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది మాళవిక మోహనన్‌. ఆమె అందాల ఆరబోస్తే ఇంటర్నెట్‌ సైతం బ్రేక్‌ అయిపోవాల్సిందే అనేట్టుగా ఆమె గ్లామర్‌ షో ఉంటుంది. బౌండరీలు బ్రేక్‌ చేసేట్టుగా ఆమె హాట్‌ షో ఉంటుంది. అందుకే ఈ బ్యూటీ కి సోషల్‌ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంటుంది. నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది. 

click me!