తెల్లవారుజామున 3 గంటలకు శృంగారానికి పిలుస్తారు.. 'ఎ' లిస్ట్ హీరోలపై బోల్డ్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

Published : Aug 03, 2022, 01:19 PM IST

తన బోల్డ్ పెర్ఫామెన్స్ తో మల్లికా శరావత్ శృంగార తారగా ముద్ర వేయించుకుంది. బాలీవుడ్ చిత్రాల్లో ముద్దు సన్నివేశాల్లో మల్లికా శరావత్ ఎంత బోల్డ్ గా నటించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

PREV
16
తెల్లవారుజామున 3 గంటలకు శృంగారానికి పిలుస్తారు.. 'ఎ' లిస్ట్ హీరోలపై బోల్డ్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

తన బోల్డ్ పెర్ఫామెన్స్ తో మల్లికా శరావత్ శృంగార తారగా ముద్ర వేయించుకుంది. బాలీవుడ్ చిత్రాల్లో ముద్దు సన్నివేశాల్లో మల్లికా శరావత్ ఎంత బోల్డ్ గా నటించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మల్లికా శరావత్ నటించిన మర్డర్ చిత్రం ఇప్పటికి ఒక సంచలనం. 

 

26

ప్రస్తుతం మల్లికా శరావత్ సినిమాల విషయంలో అంత యాక్టివ్ గా లేదు. అవకాశం వచ్చినప్పుడు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. మల్లికా శరావత్ ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. మల్లికా శరావత్ తరచుగా బాలీవుడ్ పై ఘాటు కామెంట్స్ చేస్తోంది. ఇటీవల మల్లికా తాను బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వేధింపులు ఎదుర్కొన్నానని ప్రకటించింది. 

 

36

తాను ఎక్కువగా రొమాంటిక్, శృగార పరమైన చిత్రాలు చేశాను కాబట్టి నా క్యారెక్టర్ కూడా అదే అని తప్పుడు ముద్ర వేసినట్లు మల్లికా ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఓ ఇంటర్ ఇంటర్వ్యూలో మల్లిక సెన్సషనల్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్ 'ఎ' లిస్ట్ హీరోలపై మల్లికా చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించేలా ఉన్నాయి. 

 

46

తాను బాలీవుడ్ అగ్ర హీరోలతో ఎక్కువగా నటించలేదు అని మల్లికా తెలిపింది. అందుకు కారణం ఉంది. అగ్ర హీరోలతో నటించాలి అంటే వాళ్ళు చెప్పినట్లు చేయాలి. కాంప్రమైజ్ కావాలి. నాది అలాంటి వ్యక్తిత్వం కాదు. కొందరు హీరోలు తెల్లవారు జామున ఫోన్ చేసి శృంగారానికి రమ్మని పిలుస్తారు. వెళ్లకపోతే ఆ సినిమా నుంచి తొలగించేస్తారు. 

 

56

వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, నిల్చోమంటే నిలబడాలి. అలా ఉండడం నాకు ఇష్టం లేదు అని మల్లికా తెలిపింది.  ఇటీవల మల్లికా హిందీలో నాకబ్ అనే వెబ్ సిరీస్ చేసింది. ఈ వెబ్ సిరీస్ లో మల్లికతో పాటు మరో బోల్డ్ బ్యూటీ ఇషా గుప్త కూడా నటించింది. 

 

66

బాలీవుడ్ లో నేను కొన్ని చెత్త పాత్రలో నటించాను. అలాగే మంచి రోల్స్ కూడా చేశాను. ఇదంతా కెరీర్ లో భాగం అని మల్లికా పేర్కొంది. తన మీద శృంగార తార ముద్ర పడడం వల్ల ఎక్కువగా అలాంటి రోల్స్ వచ్చేవి అని ఈ 45 ఏళ్ళ నటి పేర్కొంది. 

 

Read more Photos on
click me!

Recommended Stories