Janaki Kalaganaledu: విష్ణుని రెచ్చగొడుతున్న మల్లిక.. స్వీట్ షాప్ తాకట్టు పెట్టాలనుకున్న రామ?

First Published Jan 3, 2023, 12:09 PM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 3వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్లో జ్ఞానాంబ ఆరోజు గుడిలో పూజారి మీ ఇంటికి అరిష్టం రాబోతుందని హెచ్చరిస్తే ఏంటో అనుకున్నాను కానీ ఈ రూపంలో వస్తుందని అనుకోలేదు అంటుంది జ్ఞానాంబ. ఆరోజు కింద పడి పగిలిపోయింది ఈ ఫోటో కాదు రామ నా గుండె అని అంటుంది. అప్పుడు అమ్మ నేను చెప్పేది అర్థం చేసుకో అనడంతో ఇంకేం చెప్పొద్దు రామా అని అంటుంది. ఇప్పుడు జ్ఞానం బా జానకిని ఉద్దేశించి నువ్వే ఇలా మారావో లేకపోతే ఇంకా ఎవరైనా నిన్ను ఇలా మార్చారు నాకు అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటుంది. అయినా నీ మీద నాకున్నది కోపం కాదు బాధ ఈ కుటుంబం ఏమైపోతుందా అని బాధ. మూడు రోజులు 20 లక్షలు కట్టకపోతే అందరి ముందు తల దించుకోవాల్సి వస్తుందేమో అని బాధ అంటుంది.
 

నిన్ను తలదించుకునే పరిస్థితి తీసుకురానివ్వను ఆ డబ్బు నేనే కడతాను ఆడంతో ఎక్కడినుంచి తెస్తావు ఎక్కడ ఎలా కడతావు అని అంటుంది. పరిస్థితి చేయి దాటిపోయింది ఇప్పుడు నాకు చెప్పిన అనవసరం ఏం చేయాలో తెలిసిన వానికి ఎలా చేయాలో నేను చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది జ్ఞానాంబ. మరొకవైపు మల్లిక సంతోషపడుతూ జరిగిన విషయాలు తెలుసుకుని ఆనంద పడుతూ ఉంటుంది. ఆ తర్వాత విష్ణు జరిగిన విషయాలు తలచుకొని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి మల్లిక వస్తుంది. ఏం ఆలోచిస్తున్నారు అని అడగడంతో ఇంట్లో జరిగిన విషయాల గురించి ఆలోచిస్తున్నాను. అన్నయ్య  తమ్ముడు జాబ్ కోసం అంత అప్పు చేయడం ఏంటి అని అంటాడు విష్ణు.
 

అవన్నీ తలుచుకుంటే బాధగా ఉంది అనడంతో మల్లిక దొంగ ప్రేమలు చూపిస్తూ మీరు ఎందుకండి బాధపడతారు మీరు ఏమైనా తప్పు చేశారా అని అంటుంది. అయినా మీలాగా మంచితనంతో అందరూ కావాలి అందరూ బాగుండాలి అని మంచితనంతో కోరుకునే వాళ్ళు ఉండరు కదా అండి అంటూ విష్ణుకు మంచి మాటలు చెబుతున్నట్టుగానే చెప్పి రెచ్చగొడుతూ ఉంటుంది మల్లిక. అందరూ మీలాగా ఏం చేసినా కుటుంబం కోసమే అన్నట్టుగా ఉండాలి కానీ అందరూ అలా లేరు కదా అంటూ విష్ణు రెచ్చగొడుతూ ఉంటుంది. మరొకవైపు జానకి కిచెన్ లో వంట చేస్తూ ఉంటుంది. అప్పుడు జానకి గోవిందరాజుల కోసం భోజనం తీసుకుని వెళుతుంది. అప్పుడు అత్తయ్య గారు మీరు మామయ్య గారికి భోజనం తినిపించి మీరు వస్తే వడ్డిస్తాను అనడంతో జ్ఞానాంబ ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి మౌనంగా వెళ్ళిపోతుంది.
 

 అప్పుడు ఏమైందో చూడమ్మా అని జానకిని అక్కడి నుంచి పంపిస్తాడు గోవిందరాజులు. ఆ తర్వాత కిచెన్ లోకి వెళ్లిన జ్ఞానాంబ వంట చేసుకుంటూ ఉంటుంది. అప్పుడుజానకి చికిత మాట్లాడించడంతో ఈ వంట నాకోసం నేను చేసుకుంటున్నాను అని అంటుంది జ్ఞానాంబ. అదేంటి అత్తయ్య గారు అని అనడంతో అలవాటు చేసుకుంటున్నాను ఇంకొకసారి బాధపడకుండా ఉండడానికి అనడంతో జానకి బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత గదిలోకి వెళ్లిన రామచంద్ర తన తల్లి అన్న మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే జానకి అక్కడికి రావడంతో తన మనసులోని బాధను జానకితో చెప్పుకొని బాధపడుతూ ఉంటాడు రామచంద్ర.

 నా బాధంతా మా అమ్మ నన్ను దూరం పెడుతుందనే జానకి గారు అని బాధతో మాట్లాడతాడు రామచంద్ర. నాతో ఎవరి మాట్లాడకపోయినా వాళ్ళని కన్విస్ చేసుకోగలను కానీ నాతో అమ్మ మాట్లాడకపోతే నాకు ఎలాగో ఉంటుంది అని అంటాడు రామచంద్ర. అప్పుడు జానకి రామచంద్రకు నచ్చ చెబుతూ ధైర్యంగా ఉండండి రామచంద్ర గారు ఎలా అయినా ఈ విషయం నుంచి ఎలా బయటపడాలో అది ఆలోచించండి అని అంటుంది. మరొకవైపు జ్ఞానాంబ గోవిందరాజులు కి తినిపిస్తూ ఉంటుంది. అప్పుడు గోవిందరాజులు జ్ఞానాంబ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. రామా ఒక్కడే కాదు మిగిలిన వాళ్ళు కూడా మన బిడ్డలే కదా రామా మంచితనంతో మోసపోయాడు కానీ ఒక్క మాటైనా చెప్పాలి అది మోసమే కదా అని అంటుండగా ఆ మాటలు అని జానకి వింటూ ఉంటుంది.

అంత పెద్ద నిజం భార్యకూ చెప్పినవాడు ఈ అమ్మకు చెప్పాలనిపించడం లేదా అని జ్ఞానాంబ బాధతో మాట్లాడుతుంది. చూడు జ్ఞానం ఎప్పుడూ నీకు తెలియకుండా ఏ పని చేయని రామచంద్ర ఈ విషయంలో నీకు చెప్పకుండా అటువంటి రామ తీసుకున్నాడు అంటే దాని వెనుక ఏ కారణం ఉందో ఒక్కసారి ఆలోచించు అని అంటాడు గోవిందరాజులు. అది చిన్న విషయం కాదు కదా అండి మన కుటుంబ విషయం పెద్ద మొత్తంలో అమౌంట్ విషయం అనడంతో అంతవరకు రామచంద్ర రానివ్వడు ఆ నమ్మకం నాకు ఉంది అంటాడు గోవిందరాజులు. ఆ తర్వాత రామచంద్ర ఏం చేయాలీ అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి జానకి వస్తుంది.

ఏమైనా ఆలోచించారా రామ గారు అనడంతో ఆ విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను ఏదైనా తాకట్టు పెడితే తప్ప మనకు అంత డబ్బు రాదు కాబట్టి స్వీట్ కొట్టు తాకట్టు పెట్టాలనుకుంటున్నాను అనడంతో ఈ విషయం అత్తయ్య గారికి చెప్పండి అనగా సరే అని అంటాడు రామచంద్ర. అప్పుడు ఆ స్వీట్ కొట్టు పద్యాలు తీసుకొని రామచంద్ర బయటకు వెళ్తాడు. ఇప్పుడు జ్ఞానాంబ గోవిందరాజులికి భోజనం తినిపిస్తూ ఉండగా అక్కడికి వెళ్తాడు రామచంద్ర. అప్పుడు మల్లిక కావాలనే గొడవ మళ్ళీ పెంచాలని జ్ఞానాంబ బాగా గోవిందరాజులు వినిపించే విధంగా మాటలు మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ నీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు రామచంద్ర.

click me!