Janaki kalaganaledu: ట్యాబ్లేట్స్ కోసం వెళ్లిన జానకి.. అస్వస్థకు గురైన గోవిందరాజు.. ఆందోళనలో కుటుంబ సభ్యులు!

Published : Jul 05, 2022, 02:00 PM IST

Janaki kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతుంది. అంతేకాకుండా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు జులై 5 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
17
Janaki kalaganaledu: ట్యాబ్లేట్స్ కోసం వెళ్లిన జానకి.. అస్వస్థకు గురైన గోవిందరాజు.. ఆందోళనలో కుటుంబ సభ్యులు!

ఎపిసోడ్ ప్రారంభంలోనే.. మల్లిక (Mallika) తన తోడికోడలు అత్త మామలకు అన్నం వడ్డించడాన్ని చూసి.. సావిత్రి సినిమాలో పెద్ద కోడలు బుక్ అయినట్లు ఉంది జానకి పని అనుకుంటూ పైగా అన్ని పనులు జానకి చేస్తుందని చాలా ఆనందంగా స్వీట్స్ తింటుంది. ఆ తర్వాత జానకి (Janaki) తన అసైన్మెంట్స్ పూర్తి  చేసుకొని త్వరగా రామతో వెళ్లాలని అనుకుంటుంది.
 

27

అంతలోనే రామకు (Rama) తన అమ్మ ఫోన్ చేసి స్వీట్స్ ఇచ్చావా అని అడిగి అక్కడ పక్కనే ఉన్న ఊర్లో దివాకరం డబ్బులు ఇవ్వాలి అని ఆ బాకీ వసూలు చేసుకొని రమ్మని అనడంతో వెంటనే రామ సరే అమ్మ అని ఫోన్ పెట్టేసి జానకి (Janaki) అసైన్మెంట్ గురించి టెన్షన్ పడతాడు. జానకిని ఎలా తీసుకొని వెళ్ళాలి అని ఆలోచనలో పడతాడు.
 

37

ఆ తర్వాత.. రామ జానకి కి ఫోన్ చేయగా జానకి అసైన్మెంట్స్ పూర్తయిందని రామ (Rama) గారు అని అంటుంది. అప్పుడే రామ అమ్మ బాకీ వసూలు చేయమని చెప్పారని అంటాడు. దాంతో జానకి (Janaki) తాను ఆటోలో వెళ్లి వస్తాను పరవాలేదు అని అనటంతో రామ ఒక్క దానివి వెళ్ళకు జానకి అంటూ కావాలంటే నేను వచ్చేస్తాను అనడంతో..
 

47

ఇప్పుడు మీరు వస్తే అత్తయ్య గారికి అనుమానం వస్తుంది అని అంటుంది జానకి. నేను వెళ్తాను అని ధైర్యం చెబుతుంది. అదే సమయంలో గోవిందరాజులు (Govindharajulu) నడుము నొప్పితో ఇబ్బంది పడుతూ ఉండగా టాబ్లెట్లు తీసుకొస్తాను మామయ్య అని చీటీ తీసుకొని బయలుదేరుతుంది. అప్పుడే జ్ఞానంబ (Jnanamba) వచ్చి ఏం టాబ్లెట్లు అనడంతో గోవిందరాజులు బీపీ టాబ్లెట్ అని అబద్ధం చెబుతాడు.
 

57

ఇక అప్పుడే మల్లిక (Mallika) జానకి (Janaki) ఎక్కడికో వెళ్తుంది అనుకోని ఆపే ప్రయత్నం చేస్తుంది. టాబ్లెట్ల కోసం బ్యాగ్ వేసుకొని వెళ్లడం ఎందుకు అంటూ లేనిపోనివి క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత గోవిందరాజులు సర్ది చెప్పి తనను బయటకి పంపిస్తాడు. తను రాసిన అసైన్మెంట్ సబ్మిట్ చేసే సమయం అయిపోవడంతో అక్కడున్న ఆ సర్ ను రిక్వెస్ట్ చేసి ప్లీజ్ సార్ అంటూ సబ్మిట్ చేయండి అని ప్రాధేయపడుతుంది.
 

67

దాంతో అతడు జానకి (Janaki) పట్టుదల చూసి సరే అని తీసుకోవడంతో సంతోషపడుతుంది. ఇక అక్కడి నుండి గోవిందరాజులకు టాబ్లెట్ తీసుకోవాలని హడావుడిగా వెళ్తుంది. అప్పటికే ఇంట్లో ఉన్న గోవిందరాజులకు నడుము నొప్పి ఎక్కువ కావడంతో జ్ఞానంబ (Jnanamba) ఆందోళన పడుతుంది.
 

77

జానకి (Janaki) కి కాల్ చేస్తే తను లిఫ్ట్ చేయకపోవటంతో రామకి ఫోన్ చేస్తుంది. ఇక రామ డాక్టర్ ని తీసుకొని వస్తాడు. మరోవైపు జానకి టాబ్లెట్ల కోసం తిరగటంతో మల్లిక (Mallika) దొరికిందే ఛాన్స్ అని జానకిని మరింత ఇరికించే ప్రయత్నం చేస్తుంది.

click me!

Recommended Stories