ఈరోజు ఎపిసోడ్ లో యష్ బయటకు వచ్చి లాయర్ కి ఫోన్ చేసి అసలు విషయం చెప్పడంతో మీరేం టెన్షన్ పడకండి ఎంతమంది లాయర్లు వచ్చినా ఈ కేసు గెలవరు అని అంటాడు. అప్పుడు యష్ ఎలా అయినా ఈ కేసు గెలవకుండా చూడడానికి లాయర్ గారు అని అంటాడు. ఇంతలోనే మాలిని అక్కడికి వచ్చి మాటలు వింటూ ఉంటుంది. ఆ తర్వాత సులోచన చిత్ర పై అరుస్తూ ఎందుకే చిత్ర నిన్న రాత్రి అంత జరిగిన నాకెందుకు చెప్పలేదు అని అంటుంది. పెదనాన్న చెప్పొద్దన్నారు పెద్దమ్మ అని అంటుంది. అప్పుడు నీ ఆరోగ్యం బాగోలేదు అని అనగా నాకు నా కూతురు కాపురం కంటే నాకు ఏది అంత ముఖ్యం కాదు అంటుంది సులోచన.