ఈరోజు ఎపిసోడ్లో లాయర్ ఝాన్సీ చూడడానికి రోడ్డు ప్రమాదంలో కనిపిస్తున్న ఇది ఒక హత్యా ప్రయత్నం అని అంటుంది. అప్పుడు మాళవిక లాయర్ ఇదంతా కేవలం కల్పితం మాత్రమే అనడంతో వెంటనే లాయర్ ఝాన్సీ యాక్సిడెంట్ లో గాయపడింది సులోచన, యాక్సిడెంట్ చేసింది మాళవిక అనడంతో మాళవిక షాక్ అవుతుంది. అప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రూవ్ చేస్తాను అని అనడంతో వెంటనే మాళవిక జడ్జిగారు ఎవరు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఒప్పుకుంటాను అని అనగా వెంటనే జడ్జిగారు మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే బోన్ లోకి వచ్చి చెప్పండి అని అంటారు.