`ఢీ` షోలో ప్రియమణి, సుడిగాలి సుధీర్‌ విశ్వరూపం.. రజనీ, రమ్యకృష్ణలను అచ్చు దింపుతూ `నరసింహ`ని చూపించారు

Published : Aug 06, 2021, 06:37 PM ISTUpdated : Aug 06, 2021, 06:45 PM IST

`ఢీ` షోలో రజనీకాంత్‌ `నరసింహ` సినిమాని చూపించారు సుడిగాలి సుధీర్‌, ప్రియమణి. అచ్చం వారి పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేశారు. రజనీ మేనరిజంగా సుధీర్‌ రెచ్చిపోగా, రమ్యకృష్ణగా ప్రియమణి రక్తికట్టించింది. విశ్వరూపం చూపించారు.  

PREV
19
`ఢీ` షోలో ప్రియమణి, సుడిగాలి సుధీర్‌ విశ్వరూపం.. రజనీ, రమ్యకృష్ణలను అచ్చు దింపుతూ `నరసింహ`ని చూపించారు

ప్రదీప్‌ మాచిరాజు హోస్ట్ చేస్తున్న `ఢీ` షోలో సుడిగాలి సుధీర్‌, హైపర్‌ ఆది, రష్మి, దీపికా పిల్లి కింగ్స్, క్వీన్స్ టీమ్‌లకు లీడర్లుగా ఉన్నారు. ప్రియమణి, పూర్ణ, గణేష్‌ మాస్టర్‌ జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. 

29

నెక్ట్స్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో ఈ సారి సరికొత్తగా ట్రై చేశారు. రజనీకాంత్‌, రమ్యకృష్ణ, సౌందర్య నటించిన `నరసింహ` సినిమాలోని హైలైట్‌ సన్నివేశాలను రీమిక్స్ చేశారు.

39

ఇందులో నరసింహగా నటించిన రజనీ పాత్రని సుడిగాలి సుధీర్‌, నీలాంబరిగా నటించిన రమ్యకృష్ణ పాత్రని ప్రియమణి పోషించింది. రజనీకాంత్‌ నచ్చాడనే విషయాన్ని చెబుతూ రమ్యకృష్ణ స్టయిలీష్‌ సీన్లని, రజనీ మార్క్ మేనరిజాన్ని ఇందులో చూపించారు. 

49

`నువ్వెంతో అదృష్టవంతుడివి.. నాకే నువ్వు నచ్చావే.. ` అని ప్రియమణి చెప్పగా, సుధీర్‌ రజనీ స్టయిల్‌లో `ఓహ్‌..` అని చెప్పడం, `మీ చెల్లికి, మా అన్నయ్యకి జరిగే నిశ్చితార్థం రోజు మన అభిప్రాయం చెప్పు ఓకే.. నువ్వు సిగ్గు పడతాం. నేనే చెప్తాను` అని ప్రియమణి చేసి వెళ్లిపోతుండగా,
 

59

సుధీర్‌.. రజనీ మ్యానరిజాన్ని యదాతథంగా దించుతూ.. `మేడం జస్ట్ మినిట్‌.. మీ ఇష్టాన్ని చెప్పారు. నా ఇష్టాన్ని వినలేదు. మీరు నాకు నచ్చలేదు` అని చెప్పడంతో ప్రియమణి కోపానికి గురవుతూ కళ్లజోడు తీసేస్తుంది. అప్పుడు సుధీర్‌ స్టయిల్‌గా గ్లాసెస్‌ పెట్టుకోవడం హైలైట్‌గా నిలిచింది. 
 

69

మరోవైపు `మెరిసేటి పువ్వా.. శృంగార వీర` పాటకి మరో జడ్జ్ పూర్ణ డాన్స్ చేసింది. శారీలో ఆమె అద్భుతంగా డాన్స్ చేయగా, రజనీ స్టయిల్‌లో సుధీర్‌ మరోసారి తన మేనరిజాన్ని చూపిస్తూ డాన్స్ లు చేయడం హైలైట్‌గా నిలిచింది.
 

79

`ఢీ` షోలో ఇది హైలైట్‌గా నిలిచింది. డాన్సర్ల డాన్సులు గూస్‌బమ్స్ తెప్పిస్తే, సుధీర్‌, ప్రియమణి, పూర్ణలు చేసిన సందడి మరింత హైలైట్‌గా నిలిచింది. నెక్ట్స్ ఎపిసోడ్‌పై అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం ఈ ప్రోమో విపరీతంగా ఆకట్టుకోవడం విశేషం. 
 

89

ఇందులో ఓ రకంగా ప్రియమణి, సుధీర్‌ తమ నట విశ్వరూపం చూపించారు. రజనీ, రమ్యకృష్ణల హవభావాలను అద్బుతంగా పలికించి ఫిదా చేశారు.

99

సుధీర్‌ ఫ్యాన్స్ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ప్రోమోలోనే ఇలా ఉంటే, ఇక ఎపిసోడ్‌లో ఏ రేంజ్‌లో ఉంటుందో అంటూ కామెంట్ చేస్తున్నారు. సుధీర్‌కి ఓటేసుకుంటున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories