గతేడాది రిలీజ్ అయిన మల్టీస్టారర్ తమిళ మూవీ ‘మాస్టర్’లో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం విజయవంతం అయ్యింది. తెలుగులోనూ మాస్టర్ మూవీని రిలీజ్ చేయడంతో ఇక్కడా.. మాళవిక మోహనన్ కు మంచి గుర్తింపే వచ్చిందని చెప్పొచ్చు. అంతకు ముందు కూడా స్టార్ హీరోలు రజినీ కాంత్, దుల్కర్ సల్మాన్, ప్రుథ్వీరాజ్ సుకుమారన్ సరసన నటించి పాపులర్ అయ్యింది.