ఈ రోజు ఎపిసోడ్లో సులోచన, మాలిని ఇద్దరు వేద, యష్ వాళ్ళ వీడియో చూస్తూ నా కోడలు గొప్ప అంటే నా అల్లుడు గొప్ప అంటూ ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఖుషి ఆపుతారా మా మమ్మీ డాడీకి దిష్టి పెడతారేంటి అని అంటుంది ఖుషి. అప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరూ ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ అమ్మ నాన్న హ్యాపీ ఇక్కడ నేను హ్యాపీ మధ్యలో మీ ముసలోళ్ళు గొడవ ఏంటి అని అంటుంది ఖుషి. అప్పుడు వెంటనే మాలిని, ఎంతమాట అన్నారో చూసారా వదినగారు మీ మనవరాలే అంటే లేదు మీ మనవరాలే అంటూ మళ్ళీ గొడవ పడుతూ ఉంటారు. మరొకవైపు యష్ ఉదయాన్నే లేచి యోగ చేస్తుండగా ఇంతలో రాజా కూడా అక్కడికి వచ్చి యోగ చేస్తూ ఉంటాడు.