ఇదిలా ఉంటే ఇటీవల `కాఫీ విత్ కరణ్` షోలో పాల్గొన్న అర్జున్ కపూర్ తన మ్యారేజ్ పై స్పందించాడు. తాను ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనలో లేనని తెలిపాడు. కరోనా వల్ల సినిమాలు చేయలేకపోయానని, టైమ్ వేస్త్ అయ్యిందని, ఇప్పుడు కెరీర్ మీది పూర్తిగా ఫోకస్ పెట్టానని తెలిపాడు. తనకు వర్క్ సంతోషాన్నిస్తుందని, తాను సంతోషంగా ఉంటేనే జీవిత భాగస్వామిని సంతోష పెట్టగలను అని తెలిపారు. దీంతో మలైకా ప్రకటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం `కుట్టీ`, `ది లేడీ కిల్లర్`, `మేరి పత్ని కా రీమేక్` చిత్రాల్లో అర్జున్ నటిస్తూ బిజీగా ఉన్నాడు.