అప్పుడు అతను కాలేజీలో ఇంతమంది ఉండగా ఆవిడ మీకే ఎందుకు ఫోన్ చేశారు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో నేను సమాధానం చెబుతాడు అని అక్కడికి వస్తాడు మహేంద్ర. అప్పుడు మహేంద్ర ను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు చెప్పండి నేను మాట్లాడవచ్చా రిషి నాకోసం వచ్చాడు అనడంతో మీడియా ప్రతినిధి ఒకసారి గా షాక్ అవుతాడు. గదిలో ఇద్దరు ఉంటే ఇలాగే ఆలోచిస్తారా మీరు అని సీరియస్ అవుతాడు మహేంద్ర. అప్పుడు మీడియా ప్రతినిధి మహేంద్ర మాటలకు భయపడిపోతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి అందరిని పంపించి చేస్తాడు మహేంద్ర. ఆ తర్వాత రిషి,మహేంద్ర ప్రేమతో హత్తుకుంటాడు. తర్వాత ఇంటర్వ్యూ మొదలవడంతో జగతి వసుధర గురించి ఇంట్రడక్షన్ ఇస్తుండగా అందరూ చప్పట్లతో వసుధారని అభినందిస్తూ ఉంటారు. ఆ తర్వాత మహేంద్ర ఫణింద్ర అందరూ కలిసి వసుధారని అభినందిస్తూ సన్మానం చేయడానికి వెళ్తారు.