ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ ఒకేసారి ఇంత డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఆలోచనలు తప్పుగా ఉన్నవారు ఏదో ఒక తప్పు కోసమే అయి ఉంటుంది అనడంతో మోనిత షాక్ అవుతుంది. నేను నీకు తప్పుడు మనిషిలా కనిపిస్తున్నాను కదా కార్తీక్ సరే నేను వీడికి వంటలక్కని చంపమని సుపారి ఇస్తున్నాను అనడంతో కార్తీక్ శివ ఇద్దరు షాక్ అవుతారు. ఇదే కదా కార్తీక్ నీకు కావాల్సింది ఇదే కదా కార్తీక్ ఇందుకోసమే కదా నువ్వు నన్ను అడుగుతున్నావు ఇప్పుడు అనుమానం తీరిందా? అప్పుడు కార్తీక్ అనుమానమైన నమ్మకమైన చేసే పనులను బట్టి ఉంటుంది అనడంతో, నేనేం చేశాను కార్తీక్ మొన్నటికి మొన్న ఆటో డ్రైవర్ తో వస్తే వాడితో సంబంధం ఏంటి అని అడుగుతున్నావు అని నిలదీస్తుంది.