కృష్ణ బర్త్ డే సెలబ్రేషన్‌లో మహేష్‌బాబు మిస్సింగ్‌.. కారణమదేనా.. ఇప్పుడెక్కడున్నారంటే?

Published : May 31, 2022, 04:20 PM IST

తొలితరం తెలుగు సినిమా సూపర్‌ స్టార్‌ కృష్ణ పుట్టిన రోజు నేడు గ్రాండ్‌గా నిర్వహిస్తున్న ఫ్యామిలీ మెంబర్స్, అభిమానులు. అయితే ఇందులో మహేష్‌బాబు మిస్‌ కావడం గమనార్హం. 

PREV
110
కృష్ణ బర్త్ డే సెలబ్రేషన్‌లో మహేష్‌బాబు మిస్సింగ్‌.. కారణమదేనా.. ఇప్పుడెక్కడున్నారంటే?

సూపర్‌స్టార్‌ కృష్ణ(Krishna Birhtday)నేడు మంగళవారం(మే 31)న 79 ఏళ్లు పూర్తి చేసుకుని ఎనభైవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. దీంతో ఆయనకిది స్పెషల్‌ బర్త్ డే. కృష్ణ బర్త్ డే వేడుకలో ఆయన కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. కేక్‌ కట్‌ చేయించి సెలబ్రేషన్‌ చేశారు. Krishna Birthday Celebration.

210

కృష్ణ బర్త్ డే వేడుకలో ఆయన కూతుళ్లు, అల్లుళ్లు, అలాగే నటుడు నరేష్‌, ఆయన ఫ్యామిలీ, కృష్ణ తమ్ముడు పద్మాలయ శేషగిరి రావు, వారి మనవళ్లు, మనవరాళ్లు పాల్గొన్నారు. కృష్ణ పుట్టిన రోజుని ఘనంగా సెలబ్రేట్ చేశారు. 
 

310

ఈ సందర్భంగా దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఫ్యామిలీ ఫోటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో హీరో, కృష్ణ అల్లుడు సుధీర్‌బాబు కూడా ఉన్నారు. అలాగే కృష్ణ మొదటి భార్య ఇందిరా కూడా హజరయ్యారు. 

410

అంతా కలిసి విందులో పాల్గొనడం విశేషం. కృష్ణ ఫ్యామిలీ చూడముచ్చటగా ఉంది. కృష్ణ ఎనభై ఏళ్లు వయసు వచ్చినా ఆయన మంచి ఎనర్జీతో ఉండటం అభిమానులను హ్యాపీ చేస్తుంది. ఇటీవల ఆయన ఆరోగ్యానికి సంబంధించి పలు రూమర్స్ వినిపించిన నేపథ్యంలో కృష్ణని ఇలా చూసి ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అభినందనలు తెలియజేస్తున్నారు. 
 

510

ఇదిలా ఉంటే ఈ సారి కృష్ణ పుట్టిన రోజు వేడుకలో మహేష్‌ మిస్‌ కావడం కాస్త లోటుగా ఉంది. ఆయన తన ఫ్యామిలీ భార్య నమ్రత, కొడుకు గౌతమ్‌, కూతురుసితారలతో కలిసి ఫారెన్‌ టూర్‌ వెళ్లారు. వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇటీవల `సర్కారు వారి పాట`తో మంచి విజయాన్ని అందుకున్నారు మహేష్‌. ఈసినిమా ప్రమోషన్‌లో బిజీ బిజీగా గడిపారు. ఆ ప్రమోషన్‌ వేడి తగ్గడంతో ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారు. అందుకోసం ఫారెన్‌ టూర్‌ ప్లాన్‌ చేశారు. గత నాలుగైదు రోజులుగా మహేష్‌ ఫ్యామిలీ ఫారెన్‌లోనే ఉంది. 

610

ఈ సందర్భంగా అటు నమ్రత, ఇటు సితార ఫారెన్‌ టూర్‌ ఫోటోలను పంచుకుంటున్నారు. ప్రస్తుతం వారు జర్మనీలో ఉన్నట్టు తెలుస్తుంది. జర్మనీలో బాడన్‌-బాడన్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి దిగిన పిక్స్ ని పంచుకుంటూ ఈ విషయాన్ని నమ్రత వెల్లడించింది. అంతకు ముందు వీరు పారిస్‌ టూర్‌ ఫినిష్‌ చేసుకున్నట్టు సితార పేర్కొంది.

710

మరోవైపు మహేష్‌బాబు, నమ్రత, సితారలు సైతం సోషల్‌ మీడియా ద్వారా కృష్ణకి బర్త్ డే విషెస్‌ తెలిపారు. `హ్యపీ బర్త్‌డే నాన్న. మీలాంటి వారు నిజంగా ఎవరు లేరు. మీరు రాబోయే రోజుల్లో మరింత సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. లవ్‌ యూ` అని మహేష్‌ బాబు ట్వీట్ చేయగా,

810

`చాలా సంవత్సరాలుగా మీతో నాకు ఎంతో ఇష్టమైన జ్ఞాపకాలు ఉన్నాయి. మీరు నా జీవితంలోకి ఎంతో ప్రేమ, దయ, ఆనందాన్ని తెచ్చారు. నేను ఎప్పటికీ కృతజ్ఞతరాలుని. మీరు నా భర్తకు, నాకు, మా అందరికీ తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు. హ్యాపీ బర్త్‌డే మామయ్య` అని నమ్రతా శిరోద్కర్‌ ఇన్‌స్టాలో ఎమోషనల్‌గా పోస్ట్‌ చేశారు. ఈ పోస్టులో గౌతమ్‌, సితారతో కృష్ణ కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు నమ్రతా. 

910

మరోవైపు సితార కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాతయ్యకి బర్త్ డే విషెస్‌ చెప్పింది. ఆయనతో దిగిన ఫోటోని పంచుకుంది.ఈ రోజు మీకు, మాకు ఎంతో స్పెషల్‌ అంటూ పేర్కొంది సితార. ఈ పిక్‌ సైతం ట్రెండ్‌ అవుతుంది. 

1010

ఇదిలా ఉంటే మహేష్‌ ఈ సారి నాన్నగారి బర్త్ డేకి ఇంటి వద్ద లేకపోవడానికి మరో కారణం వినిపిస్తుంది. ఆ మధ్య కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్‌ అన్న రమేష్‌బాబు కన్నుమూసిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో ఆయన మరణం కృష్ణ ఫ్యామిలీకి తీరని లోటు. అన్నని కోల్పోయిన నేపథ్యంలో మహేష్‌ కూడా ఎంతో కుంగిపోయారు. ఇటీవల `సర్కారు వారి పాట` ఈవెంట్‌లోనూ ఆయన ఎమోషనల్‌ అయ్యారు. అయితే ఆయన మరణించి ఏడాది కాలేదు. దీంతో ఇంట్లో పెద్దగా ఎలాంటి సెలబ్రేషన్స్ జరుపుకోరు. మమేష్‌ లేకపోవడానికి అది కూడా ఓ కారణమని తెలుస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories