బాలకృష్ణ(Balakrishna) ఫస్ట్ టైమ్ హోస్ట్ గా చేస్తున్న `అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే`(Unstoppable) టాక్ షో `ఆహా`లో విజయవంతంగా రన్ అవుతుంది. దీనికి విశేష ఆదరణ దక్కింది. పలు రికార్డులు క్రియేట్ చేసింది. బాలయ్య ఫస్ట్ టైమ్ ఎంట్రీతోనే రికార్డ్ లు క్రియేట్ చేశారు. అంతేకాదు తనలోని మరో యాంగిల్‌ని బయటపెట్టారు. ఈషోకి ఇప్పటికే చాలా మంది స్టార్స్ పాల్గొన్నారు. మోహన్‌బాబు, నాని, బన్నీ, విజయ్ దేవరకొండ, రవితేజ, రానా, రాజమౌళి వంటి వారు పాల్గొని సందడి చేశారు. అనేక కొత్త విషయాలను పంచుకున్నారు.