Mahesh Babu:సర్కారు వారి పాట మరింత లేటు? మానసిక వేదనతో మహేష్ సినిమాలకు దూరం?

Published : Jan 16, 2022, 07:58 PM IST

మహేష్ సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)మరింత లేటు కానున్నట్లు సమాచారం. మరో ముప్పై రోజులు షూటింగ్ జరగాల్సి ఉండగా.. మహేష్ పాల్గొనే పరిస్థితి లేదు. ఆయన కోవిడ్ బారినపడ్డారు. కరోనా నుండి కోలుకున్నప్పటికీ మహేష్ షూటింగ్ కి రాకపోవచ్చనేది  సమాచారం. 

PREV
18
Mahesh Babu:సర్కారు వారి పాట మరింత లేటు? మానసిక వేదనతో మహేష్ సినిమాలకు దూరం?
Mahesh Babu

ఇటీవల మహేష్ (Mahesh babu)అన్నగారైన రమేష్ బాబు అనారోగ్యంతో మరణించారు. కొన్నాళ్లుగా లివరు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రమేష్ బాబు తుదిశ్వాస విడిచారు. అన్నయ్య మరణం మహేష్ ని తీవ్ర వేదనకు గురి చేసినట్లు తెలుస్తుంది. రమేష్ బాబుతో మహేష్ కి చాలా అటాచ్మెంట్ ఉంది. 

28


చిన్నప్పటి నుండి కలిసిమెలసి పెరిగిన మహేష్ బాబు, రమేష్ కలిసి చిత్రాలు కూడా చేశారు. మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా రమేష్ బాబు (Ramesh babu) హీరోగా కొన్ని సినిమాలు తెరకెక్కాయి. అతి కొద్దిమందితో మాత్రమే అనుబంధం కలిగి ఉండే మహేష్ కి రమేష్ బాబు అంటే అత్యంత ప్రీతిపాత్రం. అలాంటి వ్యక్తి మరణం మహేష్ ని మానసికంగా కృంగదీసిందనిపిస్తుంది. 

38
Mahesh Babu


చిన్నప్పటి నుండి కలిసిమెలసి పెరిగిన మహేష్ బాబు, రమేష్ కలిసి చిత్రాలు కూడా చేశారు. మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా రమేష్ బాబు (Ramesh babu) హీరోగా కొన్ని సినిమాలు తెరకెక్కాయి. అతి కొద్దిమందితో మాత్రమే అనుబంధం కలిగి ఉండే మహేష్ కి రమేష్ బాబు అంటే అత్యంత ప్రీతిపాత్రం. అలాంటి వ్యక్తి మరణం మహేష్ ని మానసికంగా కృంగదీసిందనిపిస్తుంది. 

48

మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా... డెబ్యూ మూవీ హీరో ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ ఓ ప్రమోషనల్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో మహేష్ ముఖంలో మునుపటి సంతోషం కనిపించలేదు. ఏదో కోల్పోయిన బాధ ఆయన ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఆయన ప్రస్తుత మానసిక స్థితి రీత్యా సర్కారు వారి పాట షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేదు. 
 

58
Mahesh Babu

సంక్రాంతికి విడుదల కావాల్సిన సర్కారు వారి పాట చిత్రాన్ని ఏప్రిల్ 1కి వాయిదా వేశారు. అదే రోజు ఆచార్య (Acharya)విడుదల చేస్తున్నట్లు ఇటీవల నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు. ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు విడుదల చేయడం జరగని పని. సర్కారు వారి పాట వాయిదా హామీతోనే ఆచార్య విడుదల తేదీ ప్రకటించి ఉండవచ్చు. 

68


సర్కారు వారి పాట ఆలస్యం అటుంచితే మహేష్ కొంత కాలం సినిమాల నుండి విరామం తీసుకునే ఆస్కారం లేకపోలేదు. మహేష్ కి అత్యంత ప్రీతిపాత్రులు చనిపోతే ఆయన ఏళ్ల తరబడి బ్రేక్ తీసుకుంటారు. అతిథి మూవీ తర్వాత మహేష్ కి మూడేళ్లు గ్యాప్ వచ్చింది. 2007 నుండి 2010 వరకు మహేష్ యాక్టీవ్ గా లేరు. 

 

78

మహేష్ కి కెరీర్ లో ఇంత గ్యాప్ రావడానికి కారణం అమ్మమ్మ మరణమే అని ఒక వాదన ఉంది. మహేష్ ఎంతో ఇష్టపడే అమ్మమ్మ మరణించడంతో మహేష్ కొన్నాళ్లు షూటింగ్ కి వెళ్లలేకపోయారట. ఖలేజా చిత్రం ఆలస్యం కావడానికి ఇదే ప్రధాన కారణం అమ్మమ్మ మరణమే అంటారు. మహేష్ ఇష్టపడే మరో కుటుంబ సభ్యుడు రమేష్ మరణంతో మహేష్ భారీ గ్యాప్ తీసుకునే అవకాశం కలదని కొందరి వాదన. 

88


మరి ఇదే జరిగితే ఫ్యాన్స్ మహేష్ మూవీ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది. కాగా మహేష్ తన తదుపరి చిత్రం రాజమౌళి(Rajamouli)తో కమిట్ అయ్యారు. ఈ 2022  చివర్లో లేదా 2023 ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లే సూచనలు కలవు. 

click me!

Recommended Stories