పదేళ్లు కూడా నిండని సితార ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలలో అకౌంట్స్ కలిగి వుంది. కలిగి ఉండడమే కాకూండా ఎప్పటికప్పుడు తన వీడియోలు, ఫోటోలు పంచుకుంటూ.. తన ఫాలోయర్స్ ని ఫిదా చేస్తూ ఉంటుంది.
డాన్స్, సింగింగ్ వీడియోలతో సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించిన వీడియోలు చేస్తుంది సితార. మొక్కలు నాటడం, మట్టి వినాయకుడుని పూజించడం లాంటివి అన్నమాట.
ఇవే కాకుండా స్టార్ యాక్టర్స్ కి బర్త్ డే విషెష్ తెలియజేయడం, వాళ్ళతో దిగిన ఫోటోలు పంచుకోవడం లాంటివి కూడా చేస్తుంది.
తమన్నా, అలియా భట్ వంటి స్టార్ హీరోయిన్స్ సితార ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు, సితార రేంజ్ ఏమిటో.
తాజాగా సితార ఫోటో షూట్స్ కూడా మొదలుపెట్టారు. ట్రెండో ఫ్రాక్స్ ధరించి ఫోటో షూట్స్ చేస్తున్నారు సితార. సితార క్యూట్ నెస్ కి మురిసిపోతున్న ఫ్యాన్స్ తండ్రికి తగ్గ తనయ అంటున్నారు.
మహేష్ కూడా చిన్నతనం నుండే చాలా యాక్టీవ్ గా ఉండేవారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్డం అనుభవించిన ఘనత మహేష్ సొంతం. తండ్రి, అన్నయ్యలతో కలిసి మహేష్ అప్పట్లో మల్టీస్టారర్స్ చేశారు.
మహేష్ లక్షణాలు పుణికి పుచ్చుకున్న సితార కూడా అదే తరహాలో వెండితెరను ఏలేస్తుందని అనిపిస్తుంది. ఎంట్రీ ఇవ్వాలే కానీ సితార చైల్డ్ ఆర్టిస్ట్ గా దూసుకుపోయేలా ఉంది.
టాలీవుడ్ అందగాడు మహేష్, మిస్ ఇండియా నమ్రత గారాల పట్టి సితార మరింత అందం సొంతం చేసుకుంది. మహేష్ కూతురు అని కాకుండా సీతారకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఏర్పడుతున్నారు.