చిరంజీవి, మహేష్, బాలయ్య తప్పించుకోలేకపోయారు.. వాళ్ళేదో తోపులు అని గుడ్డిగా నమ్మేశారు

Published : Aug 02, 2025, 11:22 AM IST

తమిళ దర్శకులని నమ్మి తెలుగు హీరోని నిండా మునిగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. తమిళ డైరెక్టర్స్ నుంచి తెలుగు హీరోలకు ఎదురైన ఫ్లాప్ చిత్రాల వివరాలు ఇవే. 

PREV
18
తెలుగు హీరోలతో తమిళ దర్శకులు 

టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ల కంటే ఇతర భాషల హీరోయిన్ల హవానే ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా ప్రస్తుతం తమిళ దర్శకుల ప్రభావం కూడా టాలీవుడ్ పై ఎక్కువగా ఉంది. తెలుగు హీరోలు తరచుగా తమిళ దర్శకులకు ఛాన్సులు ఇస్తున్నారు. అయితే తమిళ డైరెక్టర్స్ నుంచి తెలుగు హీరోలకు ఆశించిన రిజల్ట్ రావడం లేదు. ఎంతో నమ్మకం పెట్టుకుని అవకాశలు ఇస్తే టాలీవుడ్ హీరోలు కోలుకోలేని డిజాస్టర్స్ ఇచ్చారు తమిళ దర్శకులు. ఆ దర్శకులు ఎవరు, ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

DID YOU KNOW ?
రీమేక్ హిట్, స్ట్రైట్ మూవీ ఫ్లాప్
ఏఆర్ మురుగదాస్ రమణ చిత్రాన్ని చిరంజీవి తెలుగులో ఠాగూర్ గా రీమేక్ చేశారు. ఆ మూవీ సూపర్ హిట్ అయింది. ఏఆర్ మురుగదాస్ తో స్ట్రైట్ గా చేసిన స్టాలిన్ మూవీ మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. 
28
స్పైడర్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకుడు. తమిళంలో మురుగదాస్ కి గజినీ, తుపాకీ, సర్కార్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ఉన్నాయి. కానీ తెలుగులో మహేష్ తో రూపొందిన స్పైడర్ మూవీ ఊహించని డిజాస్టర్ గా నిలిచింది. నిర్మాతలకు ఈ చిత్రం భారీ నష్టాలు మిగిల్చింది. 

38
స్టాలిన్

మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ మూవీ కూడా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిందే. ఈ మూవీ కాన్సెప్ట్ బావుంటుంది కానీ అంచనాలని అందుకోలేకపోయింది. ఫ్యాన్స్ కోరుకున్న విజయం దక్కలేదు.

48
పంజా

తమిళంలో బిల్లా లాంటి సూపర్ హిట్ చిత్రం రూపొందించిన విష్ణువర్ధన్ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి డిజాస్టర్ ఇచ్చారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన పంజా చిత్రం ఫ్యాన్స్ ని పూర్తిగా నిరాశపరిచింది.

58
కస్టడీ

నాగ చైతన్య నటించిన కస్టడీ చిత్రాన్ని వెంకట్ ప్రభు తెరకెక్కించారు. తమిళంలో ఆయన మానాడు లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించారు. కానీ కస్టడీ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది.

68
రూలర్

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య నటించిన రూలర్ మూవీ పరమ రొటీన్ చిత్రంగా విమర్శలకు గురైంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం నిలబడలేకపోయింది.

78
వారియర్

రామ్ పోతినేని నటించిన వారియర్ చిత్రాన్ని డైరెక్టర్ లింగుస్వామి తెరకెక్కించారు. ఈ చిత్రం కూడా రొటీన్ మాస్ కథాంశంతో రూపొందింది. ఆడియన్స్ ఏమాత్రం ఈ చిత్రం పట్ల ఆసక్తి చూపలేదు. దీనితో వారియర్ మూవీ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్స్ లో ఒకటిగా నిలిచింది.

88
గేమ్ ఛేంజర్

ఈ ఏడాది టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ చిత్రాల్లో గేమ్ ఛేంజర్ ఒకటి. స్టార్ డైరెక్టర్ శంకర్ నుంచి ఫ్యాన్స్ అస్సలు ఇలాంటి చిత్రం ఊహించలేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ భారీ డిజాస్టర్ కావడంతో ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు.ఈ విధంగా టాలీవుడ్ బడా స్టార్లు సైతం తమిళ దర్శకుల నుంచి తప్పించుకోలేకపోయారు

Read more Photos on
click me!

Recommended Stories