
47 ఏళ్ల మహేష్ ఇప్పటికీ టీనేజ్ కుర్రాడిలా మెస్మరైజ్ చేస్తున్నారు. హ్యాండ్ సమ్నెస్ లో ఆయనకు పోటీ ఇచ్చే హీరో మరొకరు రాలేదు. కాగా భార్య నమ్రత ఆయనకు ఈ విషయంలో ఆయనకు ఛాలెంజ్ విసురుతుంది. మహేష్ కంటే వయసులో పెద్దదైన నమ్రత మరింత గ్లామరస్ గా కనిపిస్తున్నారు.
తాజాగా ఆమె పింక్ కలర్ డిజైనర్ వేర్ లో గ్లామరస్ ఫోటో షూట్ చేశారు. ట్రెండీ డ్రెస్ ఆమెను మరింత అందంగా మార్చింది. నమ్రత చురుకైన చూపులతో మనసులు దోచేశారు. నమ్రత ఫోటోలు వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల నమ్రత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రేమ, పెళ్లి, పిల్లలు వంటి వ్యక్తిగత విషయాలు షేర్ చేశారు. పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలని మహేష్ మాట తీసుకున్నట్లు నమ్రత తెలిపారు. అదే సమయంలో ఆమె కూడా మహేష్ కి ఓ కండీషన్ పెట్టారట. కొన్నాళ్ళ పాటు బంగ్లాలో కాకుండా అపార్ట్మెంట్ లో అద్దెకు ఉండాలని చెప్పారట.
ఇక సితార బర్త్ మహేష్, నేను ప్లాన్ చేయలేదని నమ్రత వెల్లడించారు. అయితే సితార పుట్టకపోతే మా జీవితాలు అసంపూర్ణంగా ఉండేవని చెప్పారు. ఇక గౌతమ్ ఎనిమిది నెలలకే పుట్టాడని, గౌతమ్ దక్కడేమో అని భయం వేసింది. ఈరోజు గౌతమ్ జీవించి ఉన్నాడంటే డాక్టర్స్ కారణంగానే అని నమ్రత వెల్లడించారు.
మహేష్(Mahesh Babu)-నమ్రత టాలీవుడ్ క్రేజీ కపుల్ గా ఉన్నారు. భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పాలంటే సింపుల్ గా మహేష్-నమ్రతలను చూపిస్తే సరిపోతుంది. అంత గొప్ప అన్యోన్య దాంపత్యం వారిది. 17 ఏళ్ల వైవాహిక జీవితంలో వీరు గొడవపడ్డారన్న వార్త వినలేదు.
ఆ గొప్పతనం అంతా నమ్రతదే. ముంబైలో పుట్టిన పెరిగిన ఒక అల్ట్రా మోడ్రన్ హీరోయిన్ తెలుగింటి కోడలు కావడం, ఇక్కడి పద్ధతులకు అనుగుణంగా నడుచుకోవడం గొప్ప విషయం. మహేష్ కోసం కెరీర్ వదిలేసిన నమ్రత పరిపూర్ణమైన గృహిణి అవతారం ఎత్తింది. పెద్దవారిని గౌరవించడం నుండి ధరించే బట్టల వరకు చాలా సంప్రదాయంగా నమ్రత ఉంటారు.
ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన నమ్రత వాళ్ళ ఆలనా పాలనా చూసుకున్నారు. ప్రేమగా పెంచి పెద్ద చేశారు. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక మహేష్ కెరీర్ పై ఆమె ఫోకస్ పెట్టారు. మహేష్ కి మద్దతుగా నిలుస్తూ ఆయన మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు.
మహేష్ ఎండార్స్మెంట్, వ్యాపారాలు, సినిమా డేట్స్ నమ్రత(Namrata Shirodkar)నే చూసుకుంటారు. అదే సమయంలో మహేష్ భార్య నమ్రతకు చాలా గౌరవం ఇస్తారు. కుటుంబం కోసం సమయం కేటాయిస్తారు. మహేష్ కి సినిమా తర్వాత కుటుంబమే ప్రపంచం. ఏమాత్రం విరామం దొరికినా భార్యాపిల్లలలో ఫారిన్ ట్రిప్ కి చెక్కేస్తారు.
మహేష్ ప్రతి కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోయే ముందు, ఆ చిత్రం విడుదలయ్యాక ట్రిప్ కి వెళతారు. ఇది ఆయన ఒక అలవాటుగా, సెంటిమెంట్ గా పెట్టుకున్నారు. నెలల తరబడి సాగిన షూటింగ్ లో పడ్డ కష్టమంతా వెకేషన్ లో మర్చిపోతాడు.
వంశీ సినిమా షూటింగ్ లో నమ్రత-మహేష్ మధ్య ప్రేమ చిగురించింది. దాదాపు ఐదేళ్లు వీరి మధ్య రహస్య ప్రేమాయణం సాగింది. 2005 ఫిబ్రవరి 10న మహేష్-నమ్రతల వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే దీన్ని రహస్య వివాహం అనొచ్చు. మహేష్ కంటే వయసులో నమ్రత పెద్దది కావడం విశేషం.
కాగా ఇటీవల మహేష్ కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. 2022 జనవరిలో మహేష్ అన్నయ్య రమేష్ బాబు, సెప్టెంబర్ లో అమ్మ ఇందిరాదేవి మరణించారు. ఇక నవంబర్ 15న తండ్రి కృష్ణ కన్నుమూశారు. ఏడాది వ్యవధిలో ముగ్గురు కుటుంబ సభ్యులను మహేష్ కోల్పోయారు.